తెలుగులో ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న తమిళ హీరో విజయ్ సేతుపతి. బాబు కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. బాబు సినిమా వస్తుంది అంటే తమిళ సినిమా అయినా సరే ఇక్కడి జనాలు కచ్చితంగా చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు తమిళం లో మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ అయినా ఇక్కడ అయినా సరే విజయ్ సినిమాలను జనాలు కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గ అమారింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... 

 

విజయ్ తో సినిమా చేయడం అనేది ఇప్పుడు దర్శక నిర్మాతాల్కు చాలా తల నొప్పిగా ఉంది అని సమాచారం. దానికి కారణం ఏంటీ అంటే... అతను భారీగా డిమాండ్ చేయడం తో ఇప్పుడు చాయా వరకు సినిమాలలో అతనికి అవకాశాలు ఇచ్చే వారు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. అతను మరీ దారుణంగా కోట్లు డిమాండ్ చేస్తున్నాడు అని ఇది మరీ చికాకుగా ఉంది అని అంటున్నారు. చిన్న చిన్న పాత్రలకు కూడా కోట్లు అడుగుతున్నాదట. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో అతనిని తీసుకోవడానికి గానూ చిత్ర యూనిట్  అడిగింది. 

 

దీనికి సంబంధించి అతను ఏకంగా అరగంట సన్నివేశానికి ఏకంగా కోటి రూపాయలకు పైగా అడిగాడు అని అంటున్నారు. అందులో ఆయన వారం రోజులు షూటింగ్ కి వస్తే చాలు అని కాని ఆ రేంజ్ లో డిమాండ్ చేయడం ఎంత వరకు భావ్యం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇతర హీరోలు కూడా బాబు కి అవకాశాలు ఇచ్చే విషయంలో ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచన చేసి గాని ఛాన్స్ లు ఇవ్వడం లేదు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: