టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గే ఆలోచన అనేది చేయడు రామ్ చరణ్. పాత్ర ఏ విధంగా ఉన్నా సరే అతను చాలా ధైర్యంగా చేయడానికి రెడీ గా ఉంటాడు. ఏ విధమైన సినిమా అయినా సరే అతను చేయడానికి రెడీ గా ఉంటాడు అనేది రంగస్థలం సినిమాతో స్పష్టంగా అర్ధమైంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో అతను నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతను పోలీస్ అధికారిగా నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇక ఈ సినిమా తర్వాత చేసే సినిమాపై కూడా చాలా మందికి ఆసక్తి ఉంది. 

 

ఆయన రంగస్థలం లో చెవిటి వ్యక్తిగా నటించాడు. ఇక ఇప్పుడు ఆయన కుంటి వాడిగా నటించడానికి రెడీ అయ్యాడు అని సమాచారం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. సురేందర్ రెడ్డి ఇప్పుడు ఏ సినిమా కూడా చేయడం లేదు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు సురేందర్ రెడ్డిని ఒక కథ రెడీ చేయమని చెప్పాడట రామ్  చరణ్. దీనితో ఈ సినిమా గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చాలా చర్చలే జరుగుతున్నాయి. తాను ప్రయోగం చేయడానికి సిద్దంగా ఉన్నా అని కథను ఎంత స్పీడ్ గా రెడీ అయితే అంత స్పీడ్ గా సిద్దం చేసి ఉంచాలి అని రామ్ చరణ్ చెప్పాడు అని టాక్. 

 

మరి సురేందర్ రెడ్డి రెడీ చేస్తాడా లేదా అనేది చూడాలి. సురేందర్ రెడ్డి సైరా తర్వాతః ఏ సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు ఆయన దాదాపుగా ఖాళీ గానే ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాను ఏ విధంగా తీసుకొస్తారు అనేది చూడాలి. ఆర్ఆర్ఆర్ లేట్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: