మన తెలుగులో రజని కాంత్ కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుంది అంటే చాలా మంది పనులు మానుకుని కూడా సినిమాను చూసే పరిస్థితి ఉంటుంది. అది ఏ సినిమా అయినా సరే మొదటి రోజే చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఆయన అభిమానులు. ఇక ఆయనకు తెలుగులో మంచి మార్కెట్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు పనులు మానుకుని వెళ్ళే జనాలు ఉండటం తో మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. 

 

ఇక అది అలా ఉంటే ఈ మధ్య ఆయన సినిమాలు ఇక్కడ ఎక్కువగా ఫ్లాప్ అవ్వడంతో చాలా వరకు ఆయన సినిమాలను చూడటానికి జనాలు అంతగా ఆసక్తి అనేది చూపించే పరిస్థితి కనపడటం లేదు అని చెప్పాలి. ఈ నేపధ్యంలో రజని ఇప్పుడు తెలుగు సినిమాల విషయంలో చాలా వరకు జాగ్రత్త పడుతున్నారు. అవును ఆయన సినిమాల్లో పూర్తి స్థాయి తెలుగు సినిమాను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన చిరంజీవి సినిమాతో పాటుగా మహేష్ సినిమాలో ఒక పాత్రకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

ఆయన కీలక పాత్రలో నటించాలి అని భావిస్తున్నారు. తద్వారా ఇక్కడ మార్కెట్ ని భారీ పెంచుకోవచ్చు అనే భావన లో ఆయన ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఆయన తమిళం లో ఇప్పుడు చాలా వరకు సినిమాలు చేసే విషయంలో ఆలోచిస్తున్నారు. అటు నిర్మాతలు కూడా ఆయన సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించడం లేదు అని అంటున్నారు తమిళ జనాలు. దీనికి కారణం  మార్కెట్ లేకపోవడమే అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: