అల్లు అర్జున్ సినిమా వస్తుంది అంటే చాలు యువతకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆ హీరో ఫాన్స్ ఈ హీరో ఫాన్స్ అనే తేడా లేకుండా ఆయన సినిమాలను అందరూ కూడా ఆదరించే పరిస్థితి అయితే ఉంటుంది అని చెప్పాలి. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోల అభిమానులు అయినా సరే ఆయన సినిమాను అసలు మిస్ అయ్యే అవకాశం ఉండదు. ఇక సినిమాలో ఆయన పాత్ర మీద ముందు నుంచి కూడా చర్చలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఇక సినిమాలో ఆయన పాత్ర పక్కన పెడితే సినిమా కథ విషయంలో కూడా ఉండే కొనాల గురించి కూడా జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు మన తెలుగులో ఉన్న కొందరు  దర్శక నిర్మాతలకు బన్నీ తో సినిమా చెయ్యాలి అనే కోరిక ఉంది. ఇక ఇప్పుడు బన్నీ ఖాళీ గా ఉన్న నేపధ్యంలో అతని తో ఒక చిన్న సినిమాను ప్లాన్ చేసారు. వెబ్ సీరీస్ తరహాలో బన్నీ పిల్లలతో కలిసి ఒక సినిమాను రెడీ చెయ్యాలి అని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేసి అడిగాడు అని దానికి బన్నీ కూడా ఓకే చెప్పాడు అని సమాచారం. మరి ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీని విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. బన్నీ ఇప్పుడు పుష్ప సినిమా చేస్తున్నాడు. 

 

ఆ సినిమాలో నటించడానికి గానూ బాబు చాలా వరకు కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ కోసం కూడా అతను ప్లాన్ రెడీ చేసాడు అని తెలుస్తుంది. ఇక పుష్ప సినిమా లాక్ డౌన్ లో వాయిదా పడింది. మరి అది ఎప్పుడు మొదలవుతుంది అనేది చూడాలి. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: