ఆయనో స్టార్ హీరో.. ఏటా వందల కోట్లు సంపాదిస్తాడు.. ఐదేళ్ల నుంచి ఏటా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం సంపాదించుకుంటాడు. అలాంటి హీరో ఇంట్లో బాత్ రూమ్ ఎలా ఉంటుంది.. ఆయన స్నానం ఎలా చేస్తాడు.. ఆహా.. ఏం రాజభోగం అనిపించేలా బాత్ టబ్ స్నానం చేస్తాడనే అందరూ అనుకుంటారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ.. అట్టహాసమైన బాత్ రూమ్ ఉన్నా.. బకెట్‌ తో నీళ్లు పెట్టుకునే స్నానం చేస్తాడట. ఇంతకీ ఈ వెరైటీ స్టార్ ఎవరో తెలుసా.. అక్షయ్ కుమార్.

 

IHG'Housefull 4' actors with gifts

 

అయితే ఆయన ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. అది వాళ్ల నాన్నగారు. అవును.. చిన్నప్పడు వాళ్లనాన్న అక్షయ్ కు వెరైటీగా స్నానం చేయించేవాడట. వాళ్ల ఇంట్లో ప్రతి శనివారం ఓం నమశ్శివాయ మంత్రం జోరుగా వినిపిస్తుందట. ఆ వినిపించడం దేవుడి పటం ముందు నుంచి కాదు.. స్నానాల గదిలో నుంచి.. అక్షయ్ వాళ్ల నాన్న ప్రతి శనివారం అక్షయ్ ను స్నానాల గదిలో కింద కూర్చోబెట్టి నీళ్ల బకెట్‌ని తన చేతుల్లోకి తీసుకుని ధారగా నా తలపైన పోస్తుండేవారట.

 

IHG

 

అలా పోస్తూ ‘ఓం నమశ్శివాయ...’ అని నిష్ఠగా చెబుతుండేవారట. ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నావ్‌...! అని అడిగితే.. ఏం చెప్పేవారో తెలుసా... నువ్వు నాకు ఆ శివయ్యలాంటివాడివి. అందుకే వారంవారం నీకిలా అభిషేకం చేస్తున్నా! అంటూ నవ్వేవారట అక్షయ్ తండ్రి. అలా పదమూడేళ్లు వచ్చేదాకా ఆయన నన్నిలా అభిషేకించడం కొనసాగుతూనే ఉండేదట..

 

IHG

 

అందుకే.. ఆ అలవాటు వల్లే అక్షయ్ నటుడిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నా... ఇంట్లో అత్యాధునిక షవర్‌ వసతులున్నా... బకెట్‌తో నీళ్లు పెట్టుకునే స్నానం చేస్తుంటాడట. అలా తన తండ్రిని రోజూ తలచుకుంటూ ఉంటాడట. బావుంది కదా.. అక్షయ్ బాత్ రూమ్ స్నానం కథ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: