టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. ఏయన్నార్ నట ప్రస్థానాన్ని కొనసగిస్తూ టాలీవుడ్ నాలుగు మూలస్థంభాల్లో ఒకరైన నాగార్జున ఎప్పుడు కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పట్లో ప్రయోగాలు చేసే యువ హీరో అంటే అది యువ సామ్రాట్ నాగార్జుననే అనే వారు. ట్రెండ్ కు తగినట్టుగా స్టైల్ మెయిన్ టైన్ చేస్తూ 60 ఏళ్లు వచ్చినా ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా ఆయన ఛార్మింగ్ ఉంటుంది. 

 

తనయులిద్దరూ హీరోలుగా రాణిస్తున్నా నాగార్జున ఫాం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నాడు. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నాగార్జున లేటెస్ట్ గా తన ట్విట్టర్ లో 6 మిలియన్ ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. టాలీవుడ్ హీరోల్లో హయ్యెస్ట్ ట్విట్టర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. 9 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ తో మహేష్ ముందున్నాడు. ఇక ఆ తర్వాత స్థానం తనదే అని ప్రూవ్ చేసుకున్నాడు నాగార్జున. 

 

6 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ తో నాగార్జున ఇప్పటికి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి అందరికి తెలిసేలా చేశారు. ఇక నాగార్జున తర్వాత అల్లు అర్జున్ 4.7 మిలియన్ ఫాలోవర్స్ తో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ 4 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ కలిగిఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 3.9 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. మొత్తానికి యువ హీరోలతో పాటుగా కింగ్ నాగార్జున క్రేజ్ కొనసాగుతుంది. ఆఫీసర్, మన్మధుడు 2 సినిమాల ఫ్లాప్ తో కొద్దిగా వెనుకపడ్డట్టు కనిపించిన నాగార్జున ప్రస్తుతం కథల వేటలో ఉన్నట్టు తెలుస్తుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: