బాలీవుడ్ లో ఉన్న పెద్ద సినీ కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసులుగా మంచు లక్ష్మీ ప్రసన్న, విష్ణు, మనోజ్.. లు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇటివల మంచు వారింట్లో సందడి వాతావరణ నెలకొంది. ఈ జూన్ 15 మంచు ఫ్యామిలీకి స్పెషల్ అయింది. మోహన్ బాబు కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ ‘పెదరాయుడు’ విడుదలై అదే రోజుకి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక అదే రోజున లక్ష్మీ ప్రసన్న ముద్దుల కూతురు ‘విద్యా నిర్వాణ’ పుట్టినరోజు కావడం మరో విశేషం.
ఇంతటి విశేషాలతో మంచు వారింటి సింపుల్ గా సందడి జరిగుతోంది. అయితే టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ రూపంలో మరో సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చింది. విద్యా నిర్వాణ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ స్వయంగా వీడియో కాల్ చేసి విశెష్ చెప్పడం విద్యా మోములో వెలుగులు నింపింది. ఈ సందర్భంగా ప్రభాస్, విద్య మధ్య జరిగిన బర్త్ డే విశెష్ వీడియో పిక్ ను మంచు లక్ష్మీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రభాస్ కాల్ తో విద్య చిరునవ్వుల ఫొటో కూడా షేర్ చేసింది. ప్రభాస్, మోహన్ బాబు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే.
అదే రోజు మంచు లక్ష్మీ భర్త శ్రీనివాస్ పుట్టినరోజు కూడా కావడం మరో విశేషం. ‘విద్యా పుట్టినరోజుకు ఎంతోమంది విష్ చేశారు. తను నాకు కూతురు మాత్రమే కాదు.. మీ అందరికీ ఆప్తురాలు అని అర్ధమైంది. ప్రతిఒక్కరికీ థ్యాంక్స్ చెప్పేందుకే రెండు రోజులు పట్టింది’ అని తన ట్వీట్ చేసింది మంచు లక్ష్మీ. పెదరాయుడు సంబరాలు కూడా కలవడంతో మంచు వారింట ఈ ఏడాది ఆనందం రెట్టింపు అయిందనే చెప్పాలి.
Thank you for the overwhelming msgs and blessings for @VidyaNirvana. I realize she is not my child alone but yours too with all that love you shower on her. She is so freaken blessed. Thank you thank you. Took me two days to respond to all of the msgs! pic.twitter.com/MuNpHeAeBx
— lakshmi Manchu (@LakshmiManchu) June 17, 2020