బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని వణికిస్తోంది. ఎప్పుడు ఘాటైన చర్చలకు వేదిక గా ఉంటున్న బాలీవుడ్ మరోసారి భగ్గుమన్నది. ధోని ది అన్ టోల్డ్ స్టోరీ తో యావత్ భారతదేశానికి సుపరిచితుడు గా సుశాంత్ సింగ్ మారిపోయారు. అందులో అతని నటనకు ధోని అభిమానులే కాదు భాషా భేదం లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్పందించారు. అతని నటనను మెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆయన నటించిన ప్రతి సీన్ లో ధోని కష్టాన్ని ప్రతిబింబించేలా గా ఆయన నటించారు. అందుకే శాంతి మరణానంతరం ఆ వార్త తెలిసిన తర్వాత రాజకీయ ప్రముఖులు, సినిమా పెద్దలు , క్రికెటర్లు సైతం స్పందించారు.

 

ఇప్పుడు అతని మరణం తర్వాత అనేక చర్చలకు బాలీవుడ్ వేదికగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్దలు సుశాంత్ నటనను ప్రశంసించారు. సోషల్ మీడియాలో సుశాంత్ అభిమానులు ఆయన మరణ వార్తను అందరికీ తెలిసేలా తమ బాధను వెళ్లగక్కారు. లాక్ డౌన్ సమయంలో ఈ చేదు వార్త విని అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.

 


బాలీవుడ్ లోని బంధుప్రీతి సుశాంత్ ప్రాణాలను తీసిందని దబాంగ్ సినిమా దర్శకుడు అభినవ్ కశ్యప్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా సినీ ఇండస్ట్రీలో లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. సల్మాన్ ఖాన్ సోదరుడు వలన తాను ఎంతో ఇబ్బందులు పడ్డారని తెలియజేశారు. ఈ బంధుప్రీతి ఉండడం వల్లనే ప్రశాంతి ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలకు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ స్పందించారు.

 


వేరే వారిని నిందించే ముందు ఆలోచించుకొని వ్యాఖ్యలు చేయాలని సలీం ఖాన్ అన్నారు. ఇలాంటి ఆలోచన జ్ఞానం లేకుండా చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించి సమయం వృధా చెయ్యను అని ఘాటుగా స్పందించారు. అభినవ్ కశ్యప్ ఆలోచించి  మాట్లాడలేదని సలీం ఖాన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: