లాక్ డౌన్ వలన యావత్ భారతదేశం స్తంభించిపోయింది. సినీ ప్రపంచం మొత్తం తెర వెనకాలే ఉండిపోయింది. సినీ దిగ్గజాలు సైతం గుమ్మం దాటి బయటికి రాలేదు. విలక్షణ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ లాక్ డౌన్ సమయం మొత్తం ఇంటి కి కేటాయించారు. మనందరికీ తెలుసు ఎన్టీఆర్ నటనలోనే కాదు వంట లో కూడా నైపుణ్యం కలిగిన వ్యక్తి. ఈ విషయం బిగ్ బాస్ సీజన్ చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్టీఆర్ ఇంటి దగ్గరే ఉండి తన భార్య పిల్లలకు టమాటో చట్నీ వండి పెట్టినట్లు తన భార్య ప్రణీత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

 

అంతేకాకుండా ఎన్టీఆర్ తన ఇద్దరు పిల్లలు అయినా అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకి దివంగత నేత అయిన సీనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ చిత్రాలను జూనియర్ ఎన్టీఆర్ పిల్లలతో కలిసి వీక్షించే వారు. కొన్ని సందర్భాలలో పిల్లలకు పౌరాణిక చిత్రాలలో వాడే భాష అర్థం కాకపోతే ఎన్టీఆర్ దగ్గర ఉండి పిల్లలకు తెలుగు నేర్పించారు అంట ! 

 


మనందరికీ తెలుసు పౌరాణిక పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగి పోతారని. తాను సినీ ఇండస్ట్రీకి పరిచయమైన అది కూడా పౌరాణిక చిత్రంతోనే అని అందరికీ తెలుసు. ఈ మధ్యన రామయ్య వస్తావయ్య చిత్రంలో కూడా ఎన్టీఆర్ ఆర్ ఎంట్రీ సీన్ పౌరాణిక డైలాగ్స్ తోనే మొదలయింది. సినిమా అంతగా డబ్బులు సంపాదించుకోలేక పోయినా ఆ పాత్రకు ఆయన చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 


ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్బస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఇంకో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్నట్లు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఉన్న ఒక వీడియోను అతని పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: