బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటుడు  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో దేశం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.  బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన సుశాంత్ ఎంతో కష్టపడి వెండి తెరపై చోటు దక్కించుకున్నాడు. అతనికి ఎలాంటి సినీ బ్యాగ్ గ్రౌండ్ లేదు.. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా మారాడు. క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘ధోని’ సినిమాలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాలీవుడ్ లోనే కాదు అన్ని సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  కేవలం హీరోగానే కాకుండా టివి యాంకర్ గా పలు యాడ్స్ లో నటిస్తు డబ్బు కూడా బాగానే సంపాదించాడు. కానీ అతని కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకోక ముందే జీవితాన్ని ముగించుకున్నాడు.

 

ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ బంధప్రీతి బాగా కనిపిస్తుందని.. వారసులకు మాత్రమే ఇక్కడ చోటు ఉంటుందని.. స్వయంకృషితో పైకి వచ్చేవారికి ఇక్కడ తావు లేదని విమర్శలు వినిస్తున్నాయి. అంతే కాదు పలువురు సినీ, రాజకీయ నేతలు సైతం తమ సోషల్ మాద్యమాల్లో అలాంటి విమర్శలు గుప్పిస్తున్నారు. సుశాంత్ డిప్రేషన్ లోకి వెళ్లడానికి బాలీవుడ్ లో కొంత మంది బడాబాబులే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి మూవీతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌డమ్‌ సంపాదించారు టాలీవుడ్‌ నటి రమ్యకృష్ణ.

 

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 260కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించారు. హిందీలో ఖల్నాయక్‌, క్రిమినల్‌, శపథ్‌, బడే మియా చోటే మియా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య స్పందించారు. బాలీవుడ్‌లో నా సినిమాలు అంతగా ఆడలేదు. నేను ఆఫర్లపై అంతగా ఆసక్తి చూపలేదు. ఇక్కడ స్టార్ డమ్ ఉన్నవాళ్లకే ఎక్కువ ఆదరణ ఉంటుందని భావించి అటు దృష్టి పెట్టలేదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: