హాట్ హాట్ అందాలతో మత్తెక్కించే బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఆమె ఆరెక్స్ 100 అంటూ యూత్ గుండెలను చితక్కొట్టింది. ఇక ఆమె ఆ తరువాత సీనియర్ హీరో వెంకటేష్ మూవీ వెంకీ మామలో జంట కట్టింది. మధ్యలో కూడా ఆమె ఐటెం సాంగ్స్ ఒకటి రెండు చేసింది.

IHG

ఇన్ని చేసినా కూడా ఆమెకు తగిన ఆఫర్లు లేవు. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ నుంచి దిగి వచ్చింది. మొదట్లో ఆలిండియా లెవెల్లోనే గట్టిగా ట్రై చేసింది. తనకు మంచి చాన్సులు దక్కుతాయని ఆశపడింది. కానీ బాలీవుడ్లో తనకు పక్కన పెట్టారని తాపీగా వాపోతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య నేపధ్యంలో ఆమె పెదవి విప్పి తన అవమానాలు కూడా చెప్పుకుంది.

IHG

తన ప్లేస్ లో ఎవరినో తీసుకువచ్చి నీవు పనికిరావు అని చెప్పేశాక ఇక తాను ఎలా ఉండగలను అనుకుందిట. ఆమె గుండె పగిలిందిట. అయితే గుండెను దిటవ్ చేసుకుని అలా నెట్టుకువచ్చానని చెప్పుకుంటోంది. మనసు బాగాలేనపుడు నలుగురితో కలవాలని, బాధను చెప్పుకోవాలని ఈ బ్యూటీ సూచిస్తోంది.

IHG

నిజమే ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినా తరువాత ఆవకాశాలు రాకపోయినా పాయల్ తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆశలను చల్లార్చుకోవడంలేదు. ఆమె ట్రై చేస్తూనే ఉంది. సీనియర్ హీరోలు తలుపు తట్టినా యంగ్ హీరోల పక్కన నటించాలని కసితో టాలీవుడ్ లో  ట్రై చేస్తూనే  ఉంది. 

IHG

మొత్తానికి వయసుకు  అందానికి హాట్ అయినా మంచి మనసులో నాలుగు మాటలు బాగానే పాయల్ చెప్పింది. పాయల్ లాంటి వారి మాటలు వింటే, మరికొంతమంది అయినా ఇలాంటి ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతారు అంటున్నారు. ఏది ఏమైనా అందం వెనక విషాదం  ఉంటుంది, సినిఈ తళుకు బెళుకున పక్కన క్రీనీడలు కూడా చెప్పలేనివి ఉంటాయి. వాటిని తట్టుకుని వెలుగు చూసినపుడే కీర్తి నింగిని తాకుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: