ఓ సినిమాకు టైటిల్ నిర్ణయించే ముందు మేకర్స్ అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. టైటిల్ ముందే అనౌన్స్ చేసినా.. ట్రైలర్ రిలీజ్ చేసినా రాని అభ్యంతరాలు.. సరిగ్గా విడుదల ముందు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొంత వివాదం నడుస్తోంది. గతేడాది గద్దలకొండ గణేష్ విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఓ క్లాసిక్ టైటిల్ మార్చాలంటున్నారనే రూమర్ ఇండస్ట్రీలో నడుస్తోంది. అలనాటి మేటి నటి ‘భానుమతి రామకృష్ణ’ పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. నవీన్ చంద్ర, సలోని లుత్రా నటించారు.

IHG

 

‘భానుమతి రామకృష్ణ’ టైటిల్ మార్చాలంటూ ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారనేది ఆ రూమర్. నిజానికి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ మే నెలలో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ త్వరలో ‘ఆహా’లో డిజిటల్ రిలీజ్ కానుంది. కుటుంబ నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిందని అంటున్నారు. అయితే.. వారి కుటుంబం ఈ టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. పల్లెటూరి నేపథ్యం ఉన్న యువకుడు, సిటీ నేపథ్యంలో ఉన్న అమ్మాయి మధ్య తెరకెక్కించామని.. టైటిల్ కు ఏమాత్రం అగౌరవం తెప్పించలేదని మేకర్స్ అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారని.. అయినా కూడా టైటిల్ మార్చాలనే పట్టుబడుతున్నట్టు ఓ గాసిప్ నడుస్తోంది.

IHG

 

మరోవైపు ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో జూలై 3న విడుదలకు సిద్దమవుతోంది. అభ్యంతరాలొస్తే వారికి సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తారని కూడా వార్త వైరల్ అవుతోంది. దీనిపై అఫీషియల్ న్యూస్ టీమ్ రివీల్ చేయాల్సిందే. తెలుగు సనిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు ‘భానుమతి రామకృష్ణ’. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో భానుమతి నటించిన సినిమాలు క్లాసిక్స్ గా నిలిచాయి. సినిమాల్లో పాటలను స్వయంగా పాడుకునేవారు భానుమతి.

IHG's 'Bhanumathi Ramakrishna' Trailer

మరింత సమాచారం తెలుసుకోండి: