ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమలో  హీరోలు విలన్లు అనే తేడా లేదు... నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే ఎలాంటి పాత్రలోనైనా చేయడానికి వెనకాడటం లేదు నటులు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వైవిధ్యమైన  పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన నటుడు జగపతిబాబు. ఒకప్పుడు హీరోగా ఎంతో సాఫ్ట్ గా కనిపించే జగపతిబాబు విలన్ పాత్రలో నటించగలడా  అని అందరూ అనుమానపడ్డారు. ఎందుకంటే ఒకప్పుడు కేవలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్  సినిమాలలో... నటించారు జగపతిబాబు. తర్వాత అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరపై కనుమరుగయ్యారు. కానీ లెజెండ్ సినిమాతో ఎవరూ ఊహించని విధంగా విలన్గా ఎంట్రీ ఇచ్చారు జగపతిబాబు. 

 

 అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. ప్రతి సినిమాలో విలన్ గా జగపతిబాబు కనిపిస్తున్నాడు. సాఫ్ట్ గా కనిపించే క్యారెక్టర్ అయినా.. రఫ్ గా  కనిపించే విలన్ క్యారెక్టర్ ఐనా దర్శక నిర్మాతలు మాత్రం జగపతిబాబు వైపు ఆసక్తి చూపుతున్నారు  అయితే ఈ మధ్యకాలంలో జగపతిబాబు విలన్ గా నటించిన సినిమాల్లో  తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా గుర్తుండిపోయే సినిమా అరవింద సమేత వీర రాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత.

 

 ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విజయంలో విలన్ పాత్రలో నటించిన జగపతిబాబు ఎంతో కీలకం అని చెప్పాలి. ఈ సినిమాలో బసిరెడ్డి పాత్రలో నటించిన జగపతి బాబు తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. బసిరెడ్డి పాత్రలో జగపతిబాబు అణువణువు నటించింది అనే చెప్పాలి. ఇంత గొప్ప నటన నిజంగా ఎవరికీ సాధ్యం కాదేమో అనిపిస్తుంది సినిమా చూస్తూ ఉంటే.  బసిరెడ్డి పాత్రలో  నటించిన జగపతిబాబు తనలోని ఒక అద్భుతమైన నటున్ని  తెలుగు ప్రేక్షకులు  అందరికీ పరిచయం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: