'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు టైం తీసుకుని 'సాహో' సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓకే చేయడం జరిగింది. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు ఏడాది పైగా అయినాగాని సినిమాకి సంబంధించి ఒక అప్ డేట్ కూడా బయటకు రాలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా యూనిట్ పై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. గత కొంత కాలం నుండి ఏకంగా సినిమా హీరోని టార్గెట్ చేస్తూ అసలు సినిమా జరుగుతుందా లేదా..?, ఇంతకీ ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడా రిటైర్మెంట్ ఇచ్చాడా..? అన్న రీతిలో కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు.

IHG

ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా ప్రకటించకపోవడంతో ప్రభాస్ అభిమానులు ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ని పెట్టేశారు. ఈ టైటిల్ ని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఎనౌన్స్ చేయకపోవడంతో ఫుల్ కోపం మీద ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు.

IHG

ప్రేమకథా నేపథ్యంలో ఓ వెరైటీ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు పాన్ ఇండియా తరహాలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ మూడో వారంలో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతోందని ఇటీవల వార్తలు వచ్చినా… సినిమా యూనిట్ నుండి ఎటువంటి రెస్పాండ్ రాకపోవడంతో, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా కొత్త సినిమా గురించి వారికి ఇష్టం వచ్చినట్లు… పేర్లు పెట్టుకుంటూ.. వారే డైరెక్టర్లుగా మారిపోతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: