సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ ఎంత ముఖ్యమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అంతే ముఖ్యం. ఒక్కోసారి సినిమాను నిలబెట్టేది క్యారెక్టర్ ఆర్టిస్టులే. వారి పాత్ర కీలకంగా మారి హిట్టయిన సినిమాలెన్నో ఉన్నాయి. కథకు, పాత్రలకు బలాన్నిచ్చే క్యారెక్టర్లుగా నిలిచిపోతాయి. అటువంటి అద్భుతమైన వాటిలో ఒకటిగా నిలిచిపోయింది ‘అంతఃపురం’లో జగపతిబాబు పాత్ర. కథలో ఎంత పట్టు ఉందో ప్రత్యేకించి జగపతిబాబు పాత్రలో అంత శక్తి ఉంది. సారాయి వీర్రాజు పాత్రలో జగపతిబాబు నటించాడు అనేకంటే ఆ పాత్రలో చనిపోయి జీవించాడు అని చెప్పాలి.

IHG

 

సినిమా అంతా రాయలసీమ ఫ్యాక్షనిజం మీదే నడుస్తుంది. ఫ్యాక్షన్ కుటుంబాల్లో ఒకటైన ప్రకాశ్ రాజ్ ఇంటికి భర్త, కొడుకుతో కలిసి కోడలిగా ఆ ఇంటికి వస్తుంది సౌందర్య. ఫ్యాక్షన్ గొడవల్లో కొడుకు చనిపోతే.. మనవడ్ని ఫ్యాక్షనిస్టుని చేయాలని చూస్తాడు ప్రకాశ్ రాజ్. అక్కడి నుంచి పారిపోవాలని సౌందర్య చేసే ప్రయత్నంలో పరిచయమవుతాడు జగపతిబాబు. అక్కడినుంచి జగపతిబాబు క్యారెక్టర్ సినిమాకు కీలకంగా మారిపోతుంది. దుబాయ్ వెళ్లటానికి డబ్బు పోగు చేసుకునే జగపతికి తనను కాపాడితే అడిగినంత డబ్బు ఇస్తానంటుంది సౌందర్య. దీంతో ప్రకాశ్ రాజ్ మనుషుల నుంచి సౌందర్యను  కాపాడతాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్స్, ట్రైన్ చేసింగ్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.

IHG

 

ఈ ప్రయత్నంలో సౌందర్యను కాపాడటం కంటే తనకేం ఎక్కువ కాదనుకుంటాడు జగపతిబాబు. కానీ.. ఆ ప్రయత్నంలో సౌందర్యను కాపాడి చనిపోతాడు. ఆ సన్నివేశం, పాత్ర సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సినిమా చూసే ప్రేక్షకుడికి కంటతడి తెప్పిస్తాడు జగపతిబాబు. అంత శక్తివంతమైన పాత్రను తీర్చిదిద్దాడు దర్శకుడు కృష్ణవంశీ. సారాయి వీర్రాజు పాత్రలో జగపతిబాబు నటనకు ఆ ఏడాది ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు వచ్చిందంటే ఆ పాత్ర వాల్యూ ఎంతో అర్ధం చేసుకోవచ్చు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: