తెలుగు సినీ పరిశ్రమలో హీరోల పక్కన నటించే హీరోయిన్లకు మంచి గుర్తింపు ఉంటుంది. నదియా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్. నటించింది తక్కువ సినిమాలే కానీ వచ్చిన పేరు మాత్రం ఎక్కువే. హీరోయిన్గా దక్షిణాది భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా చక్రం తప్పింది. హీరో మాస్ సినిమా తీస్తుంటే మాత్రం ఆ సినిమాలో హీరో అత్తగా నటించే అమ్మాయిపై కూడా అదేస్థాయి ఇంట్రస్ట్ ఉంటుంది.
1985లో వచ్చిన పూవ్ పూచుదవ సినిమాతో తమిళ సినిమాల్లోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది నదియా. ఆ తర్వాత 1988లో అమెరికన్ బిజినెస్ మ్యాన్ శిరీష్ గాడ్ బోల్‌ను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయింది.
మిర్చి సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన నదియా.. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ అ.. ఆతో పాటు మరిన్ని సినిమాలు కూడా చేసింది. గోల్డెన్ లెగ్ కూడా అనిపించుకుని స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంది నదియా.
ఇక నదియ మోడ్రన్ అమ్మగానే కాక అత్తారింటికి దారేది చిత్రంలో అత్తగా కూడా మంచి ఎమోషన్ సీన్స్‌లో నటించి మెప్పించింది. త్రివిక్రమ్ సృష్టించిన ఆ పాత్ర చూస్తే ఎవరికైనా అత్త పాత్రలో నటించాలనిపించేంత అందంగా తీర్చిదిద్దారు. ఇక నదియా అమ్మ, అత్త పాత్రలలో నటిస్తుందన్న మాటేగాని హీరోయిన్ల గ్లామర్‌కి ఏమాత్రం తీసిపోదు. అయితే ఈమె హీరోయిన్గా ఎన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం రాలేదుగాని. తల్లి, అత్త పాత్రలకు మాత్రం పెట్టింది పేరు అన్నట్లు ఆ పాత్రలకు మాత్రం ఓ మోడ్రన్ తల్లిగా.. మోడ్రన్ అత్తగా తెలుగు ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసిందనే చెప్పాలి.