ఎన్.టి.ఆర్, ఏయన్నార్ కాలంలో వాళ్లకు పోటీగా ఎస్.వి. రంగారావు నటన అద్భుతంగా ఉండేది. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే ఆయన చేస్తున్నారు అంటే చాలు ఆ పాత్రకు ఓ అందం వచ్చేది. రచయిత, దర్శకులు పేపర్ మీద రాసుకున్న పాత్రను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించడంలో ఎస్.వి.ఆర్ తర్వాతే ఎవరైనా.. కొన్ని సినిమాల్లో ఎస్.వి.ఆర్ నటన వల్లే సినిమాలు ఆడాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విలన్ గా కూడా ఆయన తన నట విశ్వరూపం చూపించారు. ఇక తెలుగు తెర మీద క్యారక్టర్ ఆర్టిస్టుగా వెలిగిన మరో స్టార్ కోటా శ్రీనివాస రావు. 

 

ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే నిమిషంలో దూసుకెళ్లే కోటా గారు కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దక్కిన ఓ అద్రుష్టం అని చెప్పొచ్చు. తనదైన మార్క్ సెటైరికల్ డలాగ్ డెలివెరీతో ప్రేక్షకుల హ్రుదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోటా శ్రీనివాస్ రావు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరి హీరోల సినిమాల్లో తనకు ఇచ్చిన పాత్రలో ఒక్కోసారి హీరోల ఇమేజ్ ను కూడా దాటేసి తన ప్రతిభ చాటిన సందర్భాలు ఉన్నాయి.

  

క్యారక్టర్ ఆర్టిస్ట్ వల్ల ఆడిన సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో హీరో, హీరోయిన్ అనేది నామ మాత్రంగా ఉంచుతారు. అమ్మో ఒకటో తారీఖు లాంటి సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించినా సరే అందులో ఎల్బి శ్రీరాం నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈమధ్య కాలంలో రావు రమేష్ కూడా తనకు ఇచ్చిన పాత్రని పర్ఫెక్ట్ గా చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ రిలీజైన సాయి తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమాలో హీరో కన్నా అతని కోసమే రిపీటెడ్ ఆడియెన్స్ వెళ్లారంటే నమ్మాల్సిందే. ఆ సినిమా హిట్ లో రావు రమేష్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా కనిపిస్తుంది. దర్శకుడు ఇచ్చిన పాత్రని పర్ఫెక్ట్ గా చేసి క్యారక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అందుకే వాళ్ల వల్ల కూడా సినిమాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక తెలుగు తెర మీద ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే నటులలో ప్రకాశ్ రాజ్ కూడా ఒకరు. విలక్షణకు ఆయన కేరాఫ్ అడ్రెస్ గా చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: