ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడం సినిమాలు విడుదల లేకపోవడంతో ఇండస్ట్రీ వాతావరణంలో ఒక నిశబ్ధం రాజ్యం ఏలుతోంది. ఇలాంటి పరిస్థితులలో పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఒకేసారి ఇండస్ట్రీ వర్గాలలో కలకలం సృష్టించడమే కాకుండా ఆమె పేర్కున్న దర్శకుడు ఎవరు అంటూ మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి.


వాస్తవానికి పూనమ్ కౌర్ తెలుగు సినిమాలలో నటించినవి కొన్ని సినిమాలు మాత్రమే. అయితే ఆమె తరుచు ఎదో ఒక సందర్భంలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఒక అగ్ర నటుడు మరో అగ్ర దర్శకుడుని పేరు పెట్టకుండా కలిపి టార్గెట్ చేయడం ఆమెకు అలవాటుగా మారిపోయింది అన్న కామెంట్స్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.  


బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సెలబ్రెటీల డిప్రెషన్ గురించి పెద్ద చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి అనేకమంది సెలెబ్రెటీలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగే కొన్ని పరిస్థితులలో తమకు కూడ ఆత్మహత్య చేసుకోవాలని అని అనిపించింది అనీ అయితే తాము ఆత్మస్థైర్యంతో పరిస్థితులను ఎదిరించి నిలదొక్కుకున్న విషయాలను వివరిస్తున్నారు.  


ఈ పరిస్థితులలో పూనమ్ కౌర్ కూడ కామెంట్స్ చేస్తూ ఒక దర్శకుడు తనను సినిమా నుంచి తప్పించాడని అలాగే కొన్ని సినిమాల ఆడియో వేడుకల్లో కూడా తాను లేకుండా చేశాడని అలాగే తన మీద మీడియాలో నెగెటివ్ ఆర్టికల్స్ రాయించాడని దీనితో తాను డిప్రెషన్‌ లోకి వెళ్లేపరిస్థితి వచ్చిందని పూనమ్ పేర్కొంది. స్టేజ్ మీద మహానటి సావిత్రి గొప్పదనం గురించి మాట్లాడిన ఆ దర్శకుడు లోకల్ టాలెంటుని ఎప్పుడూ ప్రోత్సహించడని పూనమ్ అభిప్రాయపడింది. ఇది చాలదు అన్నట్లుగా పూనమ్ మరొక అడుగు ముందుకు వేసి  ఆ వ్యక్తి ఒక స్టార్ హీరో విడాకులకు కారణం అంటూ విసిరిన మాటల బాణం కారుచిచ్చు గా మారి ఆ దర్శకుడు  ఎవరు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో నిన్నటి నుంచి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: