ఎన్ని సినిమాల్లో ఎంత కామెడీ చూసినా, ఎంతమంది కమెడియన్స్ కామెడీ ని ఆస్వాదించిన సరే కోట శ్రీనివాస్ గారి కామెడీకి ఉన్న లెవెల్ ఏ వేరు.. డైలాగ్ చెప్పకుండానే నవ్వించే కమెడియన్ అయన.. ఇంకా అతను కామెడీ పాత్రలు చేసిన యాక్షన్ పాత్రలు చేసిన అన్ని కొత్తగానే ఉండేవి. ఏ పాత్రకు అయినా సరే బలే సూట్ అయ్యేవారు. 

 

IHG

 

అలాంటి అద్భుతమైన కోట శ్రీనివాస్ రావు గారు, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది. అబ్బా ఆ సినిమా ఎంత బాగుంది అంటే? ఇప్పటికి ఎవరు చుసిన నవ్వకుండా ఉండలేరు. ఎంత సీరియస్ నెస్ మెయింటైన్ చేసిన ఆ సినిమా చూస్తే పడి పడి నవ్వుతారు. అంత కామెడీ ఉంది ఆ సినిమాలో. 

 

IHG

 

కోడిని గుమ్మానికి కట్టేసి కోడి కూర అని ఉహించుకొని ఎక్కడైనా తింటారా? కానీ ఇక్కడ కోట శ్రీనివాస్ రావు గారు తింటారు. పరమ పీనాసి ఈ సినిమాలో. ఈ సినిమాలో ఇతని పీనాసి తనానికి.. బ్రహ్మానందం మనసులో తిట్టుకునే జంధ్యాల తిట్లు మాములుగా ఉండవు అంటే నమ్మండి. అప్పటికి ఇప్పటికి ఎవర్ గ్రీన్ చిత్రం ఇది. 

 

IHG

 

రాజేంద్ర ప్రసాద్ మామను గెలవడానికి చేసే ప్రయత్నాలు మాములుగా ఉండవు అంటే నమ్మండి. రాజేంద్ర ప్రసాద్ ఇచ్చే ఒక్కో ఐడియా కోటా గారికి ఒక్కో ఆణిముత్యం. ఇంకా మనం అయితే పడీపడీ నవ్వుతాం. ఈ సినిమాలో అంత కామెడీ పండడానికి కోట గారే ముఖ్య కారణం. ఏది ఏమైనా ఈ కామెడీ చిత్రాన్ని మీరు ఓసారి చూసేయండి.. కడుపుబ్బా నవ్వుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: