బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమాల గతి పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఫార్ములా బేస్డ్ సినిమాలే ఎక్కువగా వచ్చేవి. ఒక దశలో ప్రేక్షకులు వాటిని చూడలేకపోయారు. కానీ బాహుబలి సినిమా వీటన్నింటినీ మార్చివేసింది. ప్రస్తుతం తెలుగులో కంటెంట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల తెలుగు సినిమాలకి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో పాటే మార్కెట్ కూడా బాగా పెరిగింది.

 


తెలుగు సినిమాల్లో వచ్చిన ఈ మార్పుని ప్రేక్షకులు కూడా స్వాగతించారు.  అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలని హిందీలో రీమేక్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు హిందీలో రీమేక్ కి వెళ్లాయి. సింబా, కబీర్ సింగ్ చిత్రాలు ఎంతటి బ్లాక్ బస్టర్స్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇంకా భాగమతి, ఆర్ ఎక్స్ 100, జెర్సీ, అల వైకుంఠపురములో మొదలగు చిత్రాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి.

 

అయితే తెలుగులో విజయం సాధించిన చిత్రాల రీమేక్ రైట్స్ ని ఛేజిక్కించుకోవాలని పోటీ పడుతుంటే టాలీవుడ్ మాత్రం మళయాల చిత్రాల రీమేక్ కోసం పరుగులు పెడుతోంది.  మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ చిత్ర హక్కుల్ని కొనుక్కుని సాహో డైరెక్టర్ సుజిత్ కి అప్పగించిన సంగతి తెలిసిందే. అదే గాక డ్రైవింగ్ లైసెన్స్ అనే మరో చిత్ర రీమేక్ రైట్స్ ని కూడా సొంతం చేసుకున్నాడు. 

 

ఇంకా అయ్యప్పనుమ్ కోషియం చిత్ర హక్కుల్ని కొనుక్కున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ దర్శకుడి కోసం వెతుకుతోంది. తాజాగా పీవీపీ ఎంటర్ టైన్ మెంట్స్ మరో మళయాల చిత్ర రీమేక్ రైట్స్ దక్కించుకుందని సమాచారం. మళయాలంలో సూపర్ హిట్ సాధించిన హెలెన్ అనే మిస్సింగ్ థ్రిల్లర్ ని తెలుగులో తెరకెక్కించనుందట. మళయాలంలో సూపర్ సక్సెస్ అయిన ఈ చిత్రాలు తెలుగులో ఎంతమేరక ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: