అక్టోబర్ 1, 2014 వ సంవత్సరం లో విడుదలైన గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు. సినిమా కథ గురించి తెలుసుకుంటే... న్యాయంగా బతికే బాలరాజు(ప్రకాష్ రాజ్) తన గ్రామంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనుకుంటాడు. అతను తన కొడుకుని డాక్టర్ చేసి ఆపై ఆసుపత్రిని కూడా కట్టిస్తాడు. కానీ ఆ కొడుకు మాత్రం అమెరికా కి వెళ్ళి పోతాడు. దాంతో బాలరాజు కొడుకుతో మాట్లాడటం మానేస్తాడు. 

IHG
కొన్ని సంవత్సరాల తరువాత తన తండ్రికి, తాతకి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని తెలుసుకున్న బాలరాజు మనవడు అభిరామ్(రామ్ చరణ్) వాళ్ళిద్దరిని కలపాలి అనుకుంటాడు. దాంతో తను అమెరికా నుండి భారత దేశానికి వచ్చి పెద్ద కుటుంబమైన బాలరాజు ఇంట్లో అడుగుపెడతాడు. అప్పటినుండి విడిపోయిన తండ్రీ కొడుకుల్ని కలిపేందుకు అభిరాం ప్రయత్నిస్తుంటాడు. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GOVINDUDU ANDARIVADELE' target='_blank' title='govindudu andarivadele-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>govindudu andarivadele</a> - Rediff.com movies
ఇకపోతే ఈ సినిమాలో కాజల్ సత్య గా, శ్రీకాంత్ బంగారి గా, వెన్నెల కిషోర్ బన్నీ గా నటించి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఏడిపిస్తున్న సమయంలో అడపాదడపా శ్రీకాంత్ పాత్ర అందర్నీ కడుపుబ్బా నవ్వించింది అని చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ ఈ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించినా... ఆ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలోనే అద్భుతమైన నటన చాతుర్యం చూపించి అందర్నీ వెండితెరకి కట్టి పడేసాడు. శ్రీకాంత్ కమలినీ ముఖర్జీ మధ్య సాగే లవ్ ట్రాక్ కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఏది ఏమైనా గతంలో సీనియర్ హీరో గా కొనసాగిన శ్రీకాంత్ రాంచరణ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి అందరి ప్రశంసలను దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: