సుశాంత్ సింగ్ బలవన్మరణం బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఎమ్ ఎస్ ధోనీ, చిచోరే వంటి సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ ఇలా హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ సింగ్ మరణానికి కారణం ఇండస్ట్రీలోని వారసత్వ రాజకీయాలే అని చాలా మంది సెలెబ్రిటీలు తమ నోరు విప్పుతున్నారు. వారసత్వం వల్లే సుశాంత్ కి అవకాశాలు రాకుండా చేసారని, అతను డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం అదే అని చెబుతున్నారు.

 

ఈ విషయమై బాలీవడ్ ఇండస్ట్రీ అగ్గిలా మండుతోంది. ఇండస్ట్రీ అంతా కొందరి చేతుల్లోనే ఉండిపొతుందని, తద్వారా తమకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇప్పిస్తున్నారని, మిగతా వాళ్ల అవకాశాలు కూడా గద్దల్లా వాళ్ళే తన్నుకుపోతున్నారని.. అందువల్ల చాలా మంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని  సెలెబ్రిటీలు డిప్రెషన్ కి లోనవుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

తాజాగా జియాఖాన్ తల్లి సల్మాన్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కేసుని ముందుకి కదలకుండా సల్మాన్ ఖానే అడ్డుకున్నాడని, తన హోదాని ఉపయోగించి ఆ కేసులో పురోగతి లేకుండా చేసాడని, ప్రధాన నిందితుడైన సూరజ్ పంచోలి తప్పించుకోవడానికి సల్మానే కారణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

 

జియా ఖాన్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన నిశ్శబ్ద్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించాడు. ఆ తర్వాత గజిని, హౌస్ ఫుల్ చిత్రాల్లో కనిపించింది. 2013లో ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు సుశాంత్ సింగ్ లాగే అప్పట్లో ఆమె మరణం పెను సంచలనంగా మారింది. బాలీవుడ్ లో బయట వ్యక్తులకి తెలియని చీకటి కోణాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: