సెప్టెంబర్ 1, 2016 వ తేదీన విడుదలైన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్ నిత్యా మీనన్, సమంత ప్రధాన పాత్రలో నటించగా... ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జనతా గ్యారేజ్ అనే పేరుతో సత్యం(మోహన్ లాల్) కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేస్తుంటాడు. మరోవైపు ఆనంద్ అనే వ్యక్తి ప్రకృతిని ప్రేమిస్తూ ఎవరైతే వాతావరణాన్ని నాశనం చేస్తున్నారో... వాళ్లందరికీ ప్రకృతిని కాపాడడం ఎంత ముఖ్యమో చెబుతూ చాలా చక్కగా అవగాహన కల్పిస్తూ ఉంటాడు. 


తన మాట వినని ఎవరిపైనైనా దాడి చేసేందుకు ఆనంద్ అసలు సందేహించాడు. ఈ క్రమంలోనే జనతా గ్యారేజ్ నాయకుడు సత్యం అతని గ్యాంగ్ తో ఆనంద్ గొడవ పెట్టుకుంటాడు. చివరికి ఆనంద్ వ్యక్తిత్వం, లక్ష్యం సత్యం కి బాగా నచ్చగా... జనతా గ్యారేజ్ లో అతడిని చేర్చుకోవాలనుకుంటాడు. ఆనంద్ జనతా గ్యారేజ్ లో చేరి పేదలను కాపాడడమే తన లక్ష్యంగా భావిస్తాడా లేదా అన్నది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించబడింది. 


నిజం చెప్పాలంటే మోహన్ లాల్ పాత్ర కారణంగానే జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సత్యం అనే పవర్ ఫుల్ పాత్రలో తాను చూపించిన నటనా ప్రతిభకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మోహన్ లాల్ గొప్ప యాక్టర్ అని అందరికీ తెలిసిందే. ఐతే కొరటాల శివ అతనికి మంచి పాత్రను ఇచ్చి వెండితెరపై మ్యాజిక్ సృష్టించాడు. మంచి పాత్ర వచ్చేసరికి మోహన్ లాల్ కూడా దుమ్మురేపాడు. తారక్ కూడా అద్భుతమైన నటుడే కాగా... వీళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ప్రేక్షకులకు కన్నుల విందు అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా ఈ సినిమా ఎన్టీఆర్ ది అని చెప్పడం కంటే మోహన్ లాల్ ది అని చెప్పడమే న్యాయమని సినీ విమర్శకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: