మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవ‌ల `ప్రతిరోజూ పండగే` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఎంత సంద‌డి చేశాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఎస్కేఎన్ సహ నిర్మాత. ఇక మరణానికి చేరువలో వున్న తాతను చివరిక్షణం వరకూ సంతోషంగా ఉంచాలని తాపత్రయపడే మనవడి కథ ఈ చిత్రం. 

IHG

వినోదంతో కూడిన కథ, విదేశాల నుంచి మారుమూల గ్రామానికి కథను పరుగులు తీయించే పట్టు సడలని కథనం .. ప్రధానమైన పాత్రలను మలిచిన విధానం ప్రేక్షకుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో రావు రమేష్ ఈ సినిమాకే హైలైట్ అనదగ్గ పాత్ర చేసాడు. సినిమాలో సాయి తేజ్, సత్యరాజ్ మెయిన్ అనుకుంటాం కానీ రావు రమేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. ఈ చిత్రంలో సాయి తేజ్‌కు తండ్రిగా రావు ర‌మేష్ న‌టించాడు. వాస్త‌వానికి సినిమాలను హీరోలు మాత్రమే నడిపించే రోజులు పోయాయి. సరైన సహాయ నటులు ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తోంది. 

IHG

అయితే ఈ సినిమాలో రావు ర‌మేష్ పాత్ర కూడా అంతే అని చెప్పాలి. క్లారిటీగా చెప్పాలంటే.. ఈ సినిమాకు ఫస్ట్ హీరో సాయి తేజ్ అయితే.. రెండో హీరో రావు రమేష్. సినిమాను ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా, కామెడీ పరంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మొత్తాన్ని రావు రమేష్ తీసుకున్నారంటే అతిశయోక్తికాదు. ఇక ఒక్కో టైమ్‌లో సాయి తేజ్‌నే డామినేట్ చేశాడు రావు రామేష్‌‌. అందుకే అసలు ఆ పాత్రను రావు రమేష్ చేయకుంటే సినిమా ఫలితం ఇంకోలా ఉండేదని చాలా మంది విమర్శకులు అభిప్రాయపడ్డారు. పర్ఫెక్ట్ టైమింగ్ తో.. త‌న‌దైన‌ హవాభావాలతో సినిమాకే హైలైట్ అనదగ్గ పాత్ర చేసిన రావు ర‌మేష్ మంచి మార్కులు కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: