మన తెలుగులో అగ్ర హీరోలు చాలా మందికి ఒక సారి స్టార్ హీరో అయిన తర్వాత వేరే పాత్రలు చెయ్యాలి అంటే కాస్త నామోషి అనేది చాలా వరకు ఉంటుంది. వరుస అవకాశాలు రావడం తో ఇక వారి స్థాయి కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. దీనితో వారు అవకాశాలు వచ్చినా సరే వేరే పాత్రల మీద పెద్దగా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉండదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు తమకు స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత మంచి పాత్రలు వచ్చినా సరే చేయడానికి ఒకటికి వంద సార్లు ఆలోచన చేసి సినిమాలు చేయడం అనేది మనం చూసే వాళ్ళం. 

 

ఇక మన తెలుగులో కొందరు నటులు మాత్రం ఏ పాత్ర వచ్చినా సరే ఏ విధంగా అయినా సరే చేయడానికి ఏ మాత్రం కూడా భయపడే వారు కాదు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే నటుడు ఏఎన్నార్. అక్కినేని సినిమాలో ఉంటే ఆయన పాత్ర ఏ విధంగా ఉంటుంది. ఆయన నటన ఏ విధంగా ఉంటుంది ఆయన ఏ విధంగా సినిమాలు చేస్తారు ఇలా అన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అగ్ర హీరోలకు ఆయన తండ్రి పాత్రలు వేసారు. సినిమాల్లో ఆయన కీలక పాత్రలు ఎన్నో పోషించారు. హీరోయిన్ కి తండ్రి గా కూడా నటించారు. 

 

సీతారామయ్య గారి మనువరాలు సినిమాలో ఆయన చేసిన పాత్ర చిరస్థాయి గా నిలిచిపోయింది అనే చెప్పాలి. అలా చెప్తూ పోతే ఆయన ఎన్నో సినిమాల్లో ఎన్నో కీలక పాత్రలను చాలా సమర్ధవంతంగా పోషించారు అనే విషయం చెప్పవచ్చు. ఆయన హీరో గా కూడా అలాగే నిలబడ్డారు నటుడిగా కూడా అలాగే నిలబడ్డారు అని చెప్పాలి. ఆయన చేసిన ఎన్నో సినిమాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: