టాలీవుడ్ లో అగ్ర హీరోలు కూడా ఎదురు చూసే నటుడు అల్లు రామలింగయ్య. టాలీవుడ్ లో ఏ నటుడు అయినా సరే ఆయన కోసం ఎదురు చూడాల్సిందే. ఆయన ఏ పాత్ర చేసినా సరే ఆయన పాత్ర కోసం ఎదురు చూసి డేట్స్ ఇవ్వాల్సిందే. ఏ పాత్రని అయినా ఆ విధంగా ఆయన నిలబెట్టారు అని చెప్పాలి. ఆయన చేసిన పాత్రలు చూసి తమిళ హీరోలు కూడా షాక్ అయ్యారు. అక్కడి అగ్ర నటులు కూడా ఆయనకు ఉన్న క్రేజ్ గాని ఆయనకు వచ్చిన పేరు గాని చూసి షాక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. 

 

ఇక తెలుగు ప్రేక్షకులకు ఆయన  లింగయ్య గా గుర్తున్నారు.  లింగయ్య సినిమాలో ఉన్నారు అంటే ఆ పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పాలి. ఏ పాత్ర అయినా సరే ఆయన పోషిస్తే దానికి అదనపు బలం అవుతారు. ఆ పాత్రకే కాదు సినిమాకే అదనపు బలం అవుతారు ఆయన. ఆ విధంగా ఆయన తన మార్క్ ని చూపించారు అని చెప్పాలి. పాత్ర ఏది అయినా సరే ఆయన ఉంటే చాలు ఇక ఆలోచించాల్సిన పని అనేది ఉండదు అనే భావన చాలా మంది దర్శక నిర్మాతలకు ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన హీరోకి తండ్రి గా హీరోయిన్ కి తండ్రి గా... 

 

విలన్ కి తండ్రిగా విలన్ పక్కన ఒక ఉద్యోగి గా ఏ పాత్రలో అయినా సరే తన మార్క్ అనేది చూపించారు అనే మాట వాస్తవం. సినిమాలో ఆయన ఉన్నారు అంటే ఆ పాత్రనే ప్రత్యేకంగా జనాలు చూసే వారు అంటే అది ఏ స్థాయిలో జనాలకు గుర్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఆయన పేరు తెచ్చుకుని నిలబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: