తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రస్తుతం ప్రస్థానం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో హీరోలు కూడా మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో  సపోర్టింగ్ రోల్స్ లో నటించడానికి కూడా వెనకాడటం  లేదు. ఇప్పటికే తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరో అయినా మోహన్ లాల్  తెలుగు లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. 

 

 అంతేకాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది యువ హీరోలు కూడా మంచి పాత్రలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా వెనకాడటం లేదు. అయితే మొన్నటి వరకు తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి  సృష్టించి... తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్వించి... ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో దర్శనమిచ్చిన హీరో అల్లరి నరేష్. సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ మహేష్ బాబు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. 

 


 సినిమా మొత్తానికి ఈ పాత్ర ఎంతో కీలకం అని చెప్పాలి. మహేష్ బాబు పాత్ర కూడా అల్లరి నరేష్ పాత్ర తో ముడిపడి ఉంటుంది చివరి వరకు. మహేష్ బాబు  ఎదుగుదల కోసం తన కెరీర్ ని సైతం త్యాగం చేసిన గొప్ప స్నేహితుడు గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది  అల్లరి నరేష్ పాత్ర. అయితే మొదటి సారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  నటించిన అల్లరి నరేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. డిఫరెంట్ లుక్ తో కనిపించిన అల్లరి నరేష్ పాత్ర ప్రేక్షకులను మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: