టాలీవుడ్ లో కోటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అయినా సరే సినిమాలో కోటా ఉంటే చాలు సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్ళడం ఖాయమని అంటూ ఉంటారు జనాలు. ఆ విధంగా ఆయన తన నటన తో మెప్పిస్తూ ఉంటారు. ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ఆ పాత్ర చేసారు ఈ పాత్ర చేసారు అనే తేడా ఏమీ లేదు. ఏ పాత్రలో అయినా సరే ఆయన కచ్చితంగా పాత్రకు న్యాయం చేసే విధంగానే సినిమాలో నటిస్తారు అనేది వాస్తవం. ఆయన ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాలో ఆయన మార్క్ అనేది ఉంటుంది. 

 

ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో... ఏ పాత్ర అయినా సరే పాత్రకు తగిన విధంగా తనను తాను మార్చుకోవడమే కాదు పాత్రకు తగిన అందాన్ని తీసుకొచ్చి ఆయన చేసే నటన ఆ విధంగా ఉంటుంది అని చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఆయనను చూసి ఆయన నటించడం లేదు జీవించారు అని అంటారు చాలా మంది. ఆ విధంగా కోటా తన నటన తో టాలీవుడ్ ని ఫిదా చేసారు. ఆయన కోసం తమిళ సినిమా దర్శకులు కూడా ఎదురు చూసారు అంటే ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ఆయనకు వచ్చిన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

అన్న అయినా విలన్ అయినా తండ్రి అయినా కమెడియన్ అయినా ఏ పాత్ర అయినా సరే పాత్రకు తగిన విధంగా ఆయన తనను తాను మార్చుకుని నటించి మెప్పించారు అనే చెప్పాలి. సినిమాలో ఆయన పాత్రకు అసలు పెట్టడానికి ఏమీ ఉండవు అనే విధంగా నటిస్తారు అని అంటారు జనాలు. ఆ విధంగా కోట పేరు తెచ్చుకుని నిలబడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: