ప్రకాష్ రాజ్.... ఏ భాషలో అయినా సరే ఆయన గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా సరే తక్కువే అవుతుంది.  బహుసా ఇండియన్ సినిమాలో ఆ రేంజ్ లో మరో నటుడ్ని చూడలేరు ఏమో... ఆయన ప్రవర్తన ఇబ్బంది కరంగా ఉన్నా సరే ఆయన దురుసుగా మాట్లాడినా సరే ఆయనను మాత్రం ప్రతీ సినిమా పరిశ్రమ భరిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం ఆయనలో ఉన్న నటన. ఈ తరానికి పెద్దగా ఆయన గురించి పరిచయం లేదేమో గాని గాని ఆయన చేసిన పాత్రలు గాని ఆయన నటన గాని ఎప్పటికి ఒక స్థాయిలో ఉండిపోతాయి అనేది వాస్తవం 

 

ఇండియన్ సినిమాలో ఏ ఒక్క నటుడు కూడా సాధించలేని విధంగా ఆయన ఘనతలు సాధించారు. తండ్రి అయినా విలన్ అయినా వ్యాపారవేత్త అయినా కామెడి చేసే విషయం లో అయినా మరొక పాత్ర అయినా సరే ఆయన చేయని పాత్ర అంటూ తెలుగులో. ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకు కచ్చితంగా అందం వస్తుంది అనే విధంగా ఆయన నటించి మెప్పించారు అనేది వాస్తవం. ఇండియన్ సినిమాలో ఏ భాషలో అయినా సరే 365 రోజులు డిమాండ్ ఉండే ఒకే ఒక్క నటుడు ఆయన. ఇక ఆయన చేసిన పాత్రలో ఎన్నో అలా నిలిచిపోయాయి చరిత్రలో. 

 

ఆయన పాత్రలు అన్నీ కూడా సినిమాకు అందం తీసుకొచ్చాయి అనే విధంగా ఉన్నాయి గాని ఎక్కడా కూడా ఆయన బాగా నటించలేదు అనే విధంగా ఎప్పుడు కూడా లేవు అనే చెప్పాలి. ఏ భాషలో అయినా సరే ఆయనకు డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం అదే అనే విషయం అందరికి తెలిసిందే. ఆ విధంగా తన మార్క్ వేసుకున్నారు. ఆయన చేతిలో ఎప్పుడు పది సినిమాలు ఉంటాయని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: