సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ల పాత్రలు ఎంత ముఖ్యమైనవో సినిమాలో నటించే ప్రతి ఆర్టిస్టు నటన కూడా అంతే ముఖ్యమైనది. ఒక సినిమాలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తూ ఉంటారు. కానీ కొన్ని సినిమాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు పోషించిన పాత్రలను వారు తప్ప ఇంకెవరూ పోషించ లేరేమో... వారిలా  ఇంకెవరు నటించ లేరేమో అనిపిస్తూ ఉంటాయి. సినిమా ఎలా ఉన్నప్పటికీ.... క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోషించిన ఆ ఒక్క పాత్ర మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఇక ఒక పాత్ర సినిమాకు వెన్నెముక గా  మారిపోతూ ఉంటుంది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ... ఏదైనా వైవిధ్యమైన నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అంటే చాలు తెలుగు ప్రేక్షకులందరికీ గుర్తొచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టు రాజేంద్ర ప్రసాద్. 

 

 

ఎన్నో హిట్ సినిమాలలో హీరోగా నటించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికీ అదే జోష్ తో నటిస్తున్నారు.. ఆయన  ఏ పాత్ర పోషించినా అది ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆయన నటనకు ఫిదా అవ్వని  తెలుగు సినీ ప్రేక్షకుడు లేడు  అనడంలో అతిశయోక్తి లేదు. ఎలాంటి పాత్ర పోషించిన ఆ పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తూ  ఉంటారు రాజేంద్ర ప్రసాద్. ఇప్పటివరకు ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే కాదు మంచి నటుడుగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఆయన సినీ కెరీర్లో  మైలురాల్ల  లాంటి పాత్రలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ.

 

 

 

ఈ సినిమాలో మహేష్ బాబు పక్కనే ఉంటూ కామెడీని తన స్టైల్ లో పండించాడు. ఈ పాత్ర ముఖ్యంగా సినీ అభిమానులను ఆకట్టుకుందని చెప్పాలి. ఈ సినిమానే కాదు అయన చేసిన ప్రతి సినిమా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి.దాంతో పాటుగా అవార్డులను కూడా అందించాయి. ఈ సినిమా విజయంలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎంతో కీలకంగా మారింది.వయసు పెరిగింది కానీ రాజేంద్ర ప్రసాద్ సినిమాలలోని ప్రత్యేకత మారలేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన నటనకు ఎవరైనా జేజేలు పలకాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: