ఆమె అందం చందమామ లాంటిది. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ భామ. తనతో పాటు తన చెల్లిని కూడా ఈ రంగంలోకి తీసుకొచ్చింది ఈ నాయిక. తాను మరెవ్వరో కదండీ కాజల్ అగర్వాల్. లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ పంచదార బొమ్మ వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.

 

 

ఏమైంది ఈ వేళ సినిమా తో టాలివుడ్ కి పరిచయం అయిన నిషా..ఆ తర్వాత సుకుమారుడులో నటించింది..  నారా రోహిత్ తో నటించిన సోలో సినిమాతో  హిట్ అందుకుంది..సోలో తర్వాత అవకాశాలు రాలేదు. ఒకవైపు అక్క కాజల్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంటే చెల్లి అవకాశాలు లేక  అక్కకంటే ముందే పెళ్లిపీటలెక్కింది. నాలుగేళ్లక్రితం ముంబైకి చెందిన  బిజినెస్ మాన్ కరణ్ వాలెచా ని పెళ్లిచేసుకుంది నిషా.. ఇప్పుడు తల్లికాబోతుందనే వార్త చక్కర్లు కొడుతుంటే కాజల్ ఫ్యామిలి కూడా దీన్ని ధృవీకరించింది.

 

ఇదిలా ఉంటే త‌ను ఇప్ప‌టికే 50 సినిమాలు పూర్తి చేసి.. 60 వైపు పరుగులు తీస్తుండ‌టం అంతా ప్రేక్ష‌కుల అభిమాన‌మే అని గుర్తు చేసుకుంటుంది కాజ‌ల్. దానికి తోడు త‌ల్లిగా మార‌డంపై కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది కాజ‌ల్. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. కాజ‌ల్ చెల్లి నిషాకు మూడేళ్ల కిందే పెళ్ళైపోయింది. ఈమెకు రెండేళ్ల కొడుకు ఇషాన్ ఉన్నాడు.

 

 

ఆ కుర్రాడితో ఆడుకోవ‌డంతోనే త‌న స‌మ‌యం అంతా అయిపోతుంద‌ని.. ఇషాన్‌తో ఆడుకుంటున్న‌పుడు త‌న‌కు అమ్మ అయిన ఫీలింగ్ వ‌స్తుంద‌ని చెబుతుంది కాజ‌ల్.పెళ్లి కాకుండానే త‌నకు ఇషాన్ త‌ల్లిగా ప్ర‌మోష‌న్ ఇచ్చాడ‌ని.. అది చూసి త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని చెబుతుంది చంద‌మామ‌. వాడు ఏది అడిగినా కూడా కాద‌న‌కుండా కొనివ్వ‌డంలోనే ఎంతో సంతోషం క‌నిపిస్తుంద‌ని.. బ‌హుశా ఇదే మ‌రి అమ్మ‌త‌నం అంటే అని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. కాజల్ కి తన చెల్లి అంటే చాల ఇష్టమో మాటల్లోనే తెలిసిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: