తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ కు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా ఒదిగిపోయి నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా... పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్ తన నటనతో ఎన్నో పాత్రలను రక్తికట్టించారు. ఇక ప్రకాష్ రాజ్ నటించిన ఎన్నో పాత్రలు తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరేట్  గా ఉన్న  విషయం తెలిసిందే. 

 


 ఇలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన పాత్రల్లో ఒకటి గోవిందుడు అందరివాడే సినిమా లో ప్రకాష్ రాజ్ పోషించిన  తాత పాత్ర. రామ్ చరణ్ తాత పాత్రలో నటిస్తాడు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ పాత్ర ఈ సినిమాలో ఎంతో కీలకం గా మారిపోతూ ఉంటుంది. తన ఊరి బాగుకోసం తన కొడుకుని డాక్టర్ చదివించి ఊర్లోనే ఆసుపత్రి పెట్టి ఊరి వాళ్లందరికీ మెరుగైన వైద్యం అందించాలి అన్న సంకల్పంతో ఉంటుంది ఈ సినిమాలో ప్రకాష్ రాజ్  పాత్ర. ఇక తన పాత్రలో హావభావాలు పండించడంలో... పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించడంలో ప్రకాష్ రాజ్  విజయం సాధించారనే చెప్పాలి. 

 


 అయితే గోవిందుడు అందరివాడే సినిమా లో హీరో రామ్ చరణ్... తాత పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ మధ్య సంభాషణలు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. కుటుంబ బంధాలను తెలియజేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ కుటుంబ బంధాలను బంధుత్వాలను గుర్తు చేస్తూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తన ఊరు బాగు కోసం ఏకంగా తన కొడుకుని డాక్టర్ చదివించి ఊర్లోనే ఆసుపత్రి పెట్టి అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉన్న ప్రకాష్ రాజ్ పాత్ర ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది అనే చెప్పాలి. ఇక ప్రకాష్ రాజ్ నటన గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.

మరింత సమాచారం తెలుసుకోండి: