సినిమాలు హిట్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నటన లో జీవించాలి. అప్పుడే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు ఆ ఆర్టిస్ట్ చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొన్ని సినిమాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు పోషించిన పాత్రలను వారు తప్ప ఇంకెవరూ పోషించ లేరేమో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోషించిన ఆ ఒక్క పాత్ర మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోతుంది. ఇక ఒక పాత్ర సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. ఇక పోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే వరుస హిట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. 

 

 

విషయానికొస్తే..  క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవదీప్. హీరోగా నటించిన సినిమాల కన్నా కూడా క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన సినిమాలే మంచి మార్కులను కొట్టేశాయి. అల్లు అర్జున్ నటించిన హిట్ సినిమా ఆర్య.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 లో నవదీప్ సపోర్టింగ్ రోల్ చేశారు. అల్లు అర్జున్ తో పోటీ పడి ఆ సినిమాలో నటించిన నవదీప్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

 

 

ఇక  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది  ఈ సినిమా విజయంలో నవదీప్  పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఇప్పటికీ కూడా ఆర్య 2 సినిమాలో నవదీప్  పాత్ర తెలుగు ప్రేక్షకులందరికీ ఫేవరెట్ గానే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల సంక్రాంతికి విడుదలయ్యి మంచి హిట్ తో పాటుగా భారీ కలెక్షన్స్ ను రాబట్టిన అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో.. ఈ సినిమాలో ఒక క్యారక్టర్ లో కనిపించి మెప్పించారు. ఆ పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అవ్వడంతో మంచి మార్కులు పడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: