ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మార్కెట్ లో నిలబడటం అనేది సినిమాల్లో చాలా కష్టం. సీనియర్ హీరోలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పాలి. అగ్ర హీరోలు గా ఉన్న వారు అయినా చిన్న హీరోలు గా ఉన్న వారు అయినా సరే ఇప్పుడు చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఏ మాత్రం వాళ్ళు అలసత్వం ప్రదర్శించినా సరే అది ఇబ్బంది గా మారే అవకాశాలు ఉంటాయి అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త షికారు చేస్తుంది. బాలకృష్ణ ఇప్పుడు సినిమాల్లో నిలబడటానికి గానూ కొన్ని కొన్న జాగ్రత్తలను ఎక్కువగా తీసుకుంటున్నారు అని సమాచారం. 

 

ఇప్పుడు ఆయన సీనియర్ హీరో గా ఉండటం తో  దానికి తోడు మార్కెట్ కూడా చాలా వరకు ఆయన కు తక్కువ కావడం తో ఇప్పుడు బాలయ్య ఎక్కువ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. సినిమా మార్కెట్ విషయంలో ఏ మాత్రం అలసత్వం ఉన్నా సరే ఇబ్బంది పడాలి అని   అందుకే ఆయన చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన ఆయన రెండు సినిమాల్లో హీరోయిన్ కి తండ్రి గా నటించడానికి గానూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం. 

 

నిజం ఎంత అనేది తెలియదు గాని ఒక స్టార్ హీరో సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఆ సినిమాలో ఆయన హీరోయిన్ తండ్రి గా నటించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు ఆయన ఇదే విధంగా ప్లాన్ చేసారు అని సమాచారం. మరి ఏ విధంగా ఆయన సినిమాల్లో కనపడతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: