వెంకటేష్ సినిమాలకు మన తెలుగులో చాలా మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు చాలా సైలెంట్ గా చేయడమే కాకుండా వాటిని ఏ మాత్రం చికాకు లేకుండా చాలా అందంగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆయన సినిమాను చూసి జాగ్రత్తలు తీసుకునే విధంగా ఉంటాయి అనేది వాస్తవ౦. ఇప్పుడు టాలీవుడ్ లో ఆయనకు చాలా క్రేజ్ ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆ క్రేజ్ ని ఆయన బాగానే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇక ఆయనను చూసి సీనియర్ హీరోలు కూడా చాలా వరకు జాగ్రత్తలు పడుతున్నారు. బాలకృష్ణ వెంకటేష్ మాదిరిగానే ఇక నుంచి తన వయసు కి తగిన విధంగా పాత్రలు చెయ్యాలి అని చూస్తున్నారు. ఇక చిరంజీవి కూడా వయసు కి తగిన పాత్రలు చేసే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతుంది ఇప్పుడు. అగ్ర హీరో అయినా సరే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మల్టీ స్టారర్ సినిమా చేస్తూ ఏ మాత్రం ఖాళీ గా ఉండటం లేదు వెంకటేష్. పాత్ర ఏది అయినా సరే స్వేచ్చగా సినిమాలు చేస్తూ తన మార్క్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నారు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు ఆయన చేస్తున్న నారప్ప సినిమా కూడా ఆయన వయసు కి తగిన విధంగా చేస్తున్న పాత్రే కావడం విశేషం. ఆయనకు ఆ పాత్ర మంచి గుర్తింపు తీసుకొస్తుంది అంటున్నారు. అందులో ఇద్దరు పిల్లలకు ఆయన తండ్రి గా ఉంటారు. దృశ్యం సినిమాలో కూడా ఆయన అదే విధంగా మంచి పాత్ర పోషించారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విధంగా ఇతర హీరోలు కూడా ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: