సాధార‌ణంగా సినిమాలను హీరోలు మాత్రమే నడిపించే రోజులు ఎప్పుడో పోయాయ‌ని చెప్పాలి. స్టార్ హీరోలు అయితే సినిమా మొత్తాన్ని తమ భుజస్కందాలపై మోసేస్తున్నారు కానీ.. మిడిల్ రేంజ్, చిన్న హీరోలకు మాత్రం సహాయ నటుల అవసరం బాగా ఉంద‌ని చెప్పాలి. అయితే సరైన సహాయ నటులు ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తోంది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్ర‌మంలోనే సినిమాల్లో హీరోలతో పాటు కొంత మంది సహాయ నటులకు మంచి ఫాలోంగ్ ఏర్ప‌డింది. 

IHG

ఒక‌వైళ అది మూవీలో మెయిన్ కేరక్టర్ అయినా కాకపోయినా.. చూసిన ప్రతీసారి ఆ పాత్రనే గుర్తు చేస్తుంటాయి. అలాంటిదే మిర్చి మూవీలో సత్యరాజ్ పోషించిన తండ్రి పాత్ర. ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం మిర్చి.  ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించిన మిర్చి వంశికృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. అప్పటివరకు రైటర్ గా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలకు కథలను అందించిన కొరటాల శివ.. ఈ మూవీ తో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను కొట్టాడు. 

IHG

ఈ సినిమాలో ప్ర‌భాస్‌కు తండ్రి స‌త్య‌రాజ్ న‌టించారు. ఈ చిత్రంలో సత్య రాజ్ ఎక్కడా శృతి మించకుండా ఒక తండ్రి పాత్ర‌లో ఎంతో చ‌క్కగా జీవించాడు. వాస్త‌వానికి తమిళంలో బాగా ఫేమస్ అయిన స్టార్ హీరో సత్యరాజ్ ‘శౌర్యం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ త‌ర్వాత మిర్చి సినిమాతో ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్ట‌కున్నాడు. ఇక బాహుబ‌లి సినిమాలో కట్టప్ప పాత్ర స‌త్య‌రాజ్‌కు ఎంత‌టి స్టార్ డమ్ తెచ్చిపెట్టిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాగే ఇటీవ‌ల వ‌చ్చిన ప్రతిరోజూ పండగే చిత్రంలోనూ స‌త్మ‌రాజ్ బాగా ఆక‌ట్టుకున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: