మెగా బ్రదర్ నాగబాబు సినీ నటుడిగా కంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా ఆయన పాపులారిటీ మరింత పెరింగింది. జనసేనలో చేరి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఇలా ఎంటర్ టైన్మెంట్, రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఓ యూట్యూబ్ చానెల్ ద్వారా కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ‘నా ఛానెల్ నా ఇష్టం’ ద్వారా ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో.. రీసెంట్ గా బాలకృష్ణ విషయంలో కూడా ఆయన స్పందన తెలిసిందే. అయితే.. ఆయన ఇప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశమైంది.

IHG

 

ఆయన చానెల్ పేరు మార్చినట్టు రీసెంట్ పోస్ట్ లో తెలిపారు. ఇకపై ఈ చానెల్ పేరు ‘మన చానెల్.. మన ఇష్టం’గా మార్చినట్టు చెప్పుకొచ్చారు. ఇకపై ఈ చానెల్ లో కాంట్రవర్సీలు ఉండవని చూఛాయగా చెప్పుకొచ్చారు. యూట్యూబ్ చానెల్ లో తనకు ఆదరణ పెరిగిందని.. 3లక్షల మంది యూజర్స్ రావడం గొప్ప విషయమన్నారు. ఇంతటి ఆదరణ ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే చానెల్ పేరు మార్చినట్టు చెప్పుకొచ్చారు. యూజర్స్ పెరిగినా నాగబాబు తన పంధా మార్చుకోవాల్సిన అవసరం ఏముందని కామెంట్లు వస్తున్నాయి. సమకాలీన అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలు ఫ్యాన్స్ కు జోష్ ఇస్తున్నాయనే కామెంట్లు కూడా వస్తున్నాయి.

IHG

 

అయితే.. ఇటివల జరిగిన పరిణామాల నేపథ్యంలో నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా.. అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. నాగబాబు వ్యాఖ్యలకు మెగా ఫ్యాన్స్ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తో నాగబాబు పొలిటికల్ అంశాలు మాట్లాడరేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి చానెల్ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో, ఆయన ఆలోచనలు ఏంటో.. నాగబాబు మాత్రమే చెప్పే విషయం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: