ఎన్.టి.ఆర్, ఏయన్నార్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో శోభన్ బాబు ఒకరు. అప్పట్లో ఆయనకున్న లేడీ ఫాలోయింగ్ ఏ హీరోకి లేదు. రొమాంటిక్ హీరోగా శోభన్ బాబు తన సత్తా చాటారు. కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసినా హీరోగా ఫాం కొనసాగించిన తర్వాత హీరోగానే సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు శోభన్ బాబు. అయితే ఆయన మంచి ఫాంలో ఉన్న టైం లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి వారు కూడా అప్పుడే స్టార్స్ గా ఎదిగారు.

 

ఆ టైం లో ఓ సన్మాన సభకు అటెండ్ అయిన శోభన్ బాబు చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు తన బిడ్డలతో సమానమని.. వాళ్లు తనకు.. తాను వాళ్లకు పోటీ కాదని.. మీరు అలాంటి గొడవలు పడకండని.. మరీ నచ్చకపోతే దూరంగా ఉండండని అన్నారు శోభన్ బాబు. 1990లోనే స్టార్ వార్, ఫ్యాన్స్ మధ్య గొడవల గురించి మీరంతా సైలెంట్ గా ఉండండని ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు శోభన్ బాబు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

80, 90ల దశకంలో శోభన్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండేవి. అప్పట్లో సంవత్సరానికి పదుల కొద్దీ సినిమాల్లో నటించిన శోభన్ బాబు హీరోగా మాత్రమే రిటర్ అవడం అప్పట్లో అందరికి షాక్ ఇచ్చింది. అప్పట్లో లేడీ ఫ్యాన్స్ అంతా శోభన్ బాబు అంటే పడి చచ్చేవారు. హీరోగానే రిటైర్మెంట్ అయిన శోభన్ బాబు ఆ తర్వాత ఎంత పెద్ద సినిమాలో చిన్న చిన్న పాత్రలకు ఆఫర్స్ వచ్చినా చేయనని చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: