పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ఇప్పటికే నివేదా థామస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా పవన్ సరసన శృతి హాసన్ ను తీసుకున్నట్టు టాక్. సినిమా డైరక్టర్ వేణు శ్రీరాం శృతి హాసన్ ఉందని కన్ ఫర్మ్ చేశాడు. అయితే మళ్లీ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా నుండి శృతి హాసన్ ఎగ్జిట్ అంటూ వార్తలు రాస్తున్నారు. ఆల్రెడీ కొంత పార్ట్ షూటింగ్ కూడా అయ్యిందని డైరక్టర్ చెబితే ఇప్పుడు మళ్లీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్ల సినిమా నుండి తొలగించారని రాస్తున్నారు.

 

ఇంతకీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ ఉన్నట్టా లేనట్టా.. పవన్ సినిమాపై ఈ కన్ ఫ్యూజన్ ఎందుకు. సినిమాలో శృతిది చిన్న పాత్రే ఆమె కాకపోయినా మరెవరైనా ఆ రోల్ చేస్తారు. కాని ఆల్రెడీ కొంత భాగం షూట్ అయ్యాక మళ్లీ రీ షూట్ చేయడం కుదరదు. అదీగాక మిగతా వారితో ఏమో కాని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గర ఇలాంటి ఆటలు సాగవు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇవ్వాల్సిందే.

 

ఇక ఇదిలాఉంటే ఈమధ్యనే ముంబై నుండి హైదరాబాద్ వచ్చిన శృతి హాసన్ ప్రస్తుతం హోం క్వారెంటైన్ లో ఉంది. అది పూర్తి కాగానే రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న క్రాక్ సినిమా షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబో సినిమాలో కూడా అమ్మడు హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. వకీల్ సాబ్ విషయంలోనే శృతి నటిస్తుందా లేదా అన్న విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: