టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక హీరోయిన్ సినిమా చేసింది అంటే ఆమెకు మంచి పేరు వస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే.  జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం అనేది చాలా మందికి ఇప్పుడు తెలుగులో ఒక కల అనేది వాస్తవం. ఇతర భాషల హీరోయిన్ లు కూడా తెలుగులో అతని తో సినిమా చేస్తే చాలు ఇక పాపులర్ అయిపోవచ్చు అనే ఆలోచనలో ఉంటారు అని అంటారు జనాలు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ లో కొందరు యువ హీరోయిన్ లు ఇక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచార జరుగుతుంది. 

 

అందులో జాన్వీ కపూర్ ముందు ఉంది అని సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటీ అంటే తారక్ కూడా ఆమె తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. తారక్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు.  బాలీవుడ్ లో ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె తో సినిమా చెయ్యాలి అని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అగ్ర హీరోలు చిన్న హీరోల విషయంలో ఇప్పుడు  ఆమె చాలా వరకు పాన్ ఇండియాకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనలోనే ఉన్నారు మరి. 

 

అందుకే ముందే ఆమె డేట్స్ విషయంలో తారక్ తొందరపడుతున్నాడు అని తెలుస్తుంది. మరి ఆమె చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు తారక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడు ఆ సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఎప్పుడు అవుతుందో ఈ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో అనేది చూడాలి. ఇప్పుడు తారక్ లాక్ డౌన్ లో చాలా వరకు ఖాళీ గానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: