టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్ లు ఇప్పుడు అవకాశాలతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది స్టార్ హీరోలు మాత్రం హీరోయిన్ ల విషయంలో ఇప్పుడు కాస్త దూకుడుగా ఆలోచనలు చేస్తున్నారు. హీరోయిన్ ల విషయంలో కొందరిని పక్కన పెట్టాలి అని కొందరిని తీసుకోవాలి అని చూస్తున్నారు. తమిళంలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ కి తెలుగులో అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఇప్పుడు  తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తుంది గని అవి స్టార్ హీరోల సినిమాలు కాదు. 

 

ఇక ఇప్పుడు ఆమెకు అక్కడ భారీగా ఆఫర్లు వస్తున్నాయి. అందరిలా ఆమె స్కిన్ షో చేసినా చేయకపోయినా సరే ఆమెకు మాత్రం మంచి గుర్తింపు అనేది ఉంది. అగ్ర హీరోలు ఆమె తో సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఆమె చిన్న హీరోయిన్ అయినా సరే ఆమెను ఇప్పుడు సినిమాల్లోకి తీసుకోవడానికి మన స్టార్ హీరోలు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు అని చెప్పవచ్చు. మహేష్ బాబు సర్కారు వారి పాటలో ఆమెను తీసుకోవాలి అని దర్శక నిర్మాతలకు చెప్పాడు అని సమాచారం. 

 

ఆమెకు ఇప్పటికే ఫోన్ చేసి అడిగారు అని ఆమె చెప్పిన కండీషన్ లకు కూడా ఓకే చెప్పారు అని తెలుస్తుంది. ఆమె డేట్స్ ఇచ్చే విషయంలో కాస్త లేట్ అయినా సరే ఇబ్బంది లేదు అని చెప్పారట స్టార్ హీరోలు. ఇప్పుడు ఆమె మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె ఏ సినిమా చేస్తుంది అనేది స్పష్టత ఇంకా రావడం లేదు. దీనితో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: