టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆమెకు ఎక్కడ లేని పేరు వచ్చింది చాలా తక్కువ కాలంలో అనేది వాస్తవం. ఆమె సినిమాలు ఆమె నటన జనాలకు బాగానే నచ్చింది గాని మరీ గ్లామర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం తో ఆమెను పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో చేసిన ఆమె ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. అయితే ఆమె ఇప్పుడు మళ్ళీ తెలుగులో బిజీ అవ్వాలి అని చూస్తుంది 

 

ఇందుకోసం బాలీవుడ్ ని పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో ఆమె ఉంది అని సమాచారం. బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలకు కూడా పెద్దగా అంత పేరు ఏమీ రాలేదు అనే సంగతి తెలిసిందే. అందుకే ఇక్కడ ఆమె సినిమాలను ఫోకస్ చెయ్యాలి అని ఏ మాత్ర౦ కూడా భారీగా డిమాండ్ చేయకుండా సినిమాలను చెయ్యాలి అని భావిస్తుంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అగ్ర హీరోల సినిమాల విషయంలో ఇప్పుడు ఆమెను తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. పూర్తిగా ఆమెను హీరోయిన్ గా కాకపోయినా సరే తీసుకుంటారు అని టాక్ అయితే వినపడుతుంది. 

 

ఇక ఇప్పుడు ఆమె పంజాబ్ లో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అని క్వారంటైన్ లో ఉంటుంది అని అప్పుడు సినిమాలను మొదలు పెట్టే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. ఇక మన తెలుగులో ఇప్పుడు ఇద్దరు హీరోయిన్ ల హవా ఎక్కువగా ఉంది. మరి వారిని తట్టుకుని ఏ విధంగా నిలబడుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: