మన తెలుగులో ఎంత మంచి పేరు వచ్చినా సరే ఇతర భాషల్లో అవకాశాల కోసం అక్కడి మార్కెట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొందరు హీరోలు. ఇక్కడి మార్కెట్ బాగానే ఉన్నా సరే తమిళం నుంచి ఏదో సాధించాలి అనే ఆలోచనలో ఉంటారు. అందుకే అక్కడి నటులకు ఎక్కువగా మన తెలుగులో అవకాశాలు ఇస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. ఇక విజయ్ సేతుపతి ఉపేంద్ర లాంటి వాళ్లకు మన తెలుగులో మంచి డిమాండ్ ఉంది అనే సంగతి తెలిసిందే. ఉపేంద్ర సినిమాలో ఇక్కడ తక్కువే చేసినా సరే ఆయనను విలన్ గా తీసుకునే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది అర్ధమవుతుంది. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే వాళ్ళు ఉంటే ఇతర భాషల్లో మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది అని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి వాళ్ళు ఉండాలి అని అలా అయితేనే పాన్ ఇండియా మార్కెట్ అనేది పెరుగుతుంది అని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు మన వాళ్ళు కూడా అక్కడ నటించాలి అని చూస్తున్నారు. బన్నీ ఒక సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. అతను విజయ్ సినిమాలో విలన్ గా చేసే అవకాశం ఉంది అని టాక్ వినపడుతుంది. 

 

నిజమా కాదా అనే దాని మీద ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రాలేదు గాని అతను పుష్ప సినిమాను తమిళనాడు లో కూడా షూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మార్కెట్ కోసం అక్కడి నటులను ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు అతను అక్కడ సినిమా చేసేఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుత౦ పుష్ప సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: