కరోనా మహమ్మారి వల్ల యావత్ ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది. చిన్న పెద్ద , పేద ధనిక తేడా లేకుండా అందరిక్ సోకుతుంది. అయితే కొంతమంది ప్రముఖులు , సెలబ్రెటీలు కరోనా లాక్ డౌన్ సమయంలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా ఈ కరోనా టైమ్ లో తన అనుభవాన్ని తన అభిమానులతో పంచుకున్నారిలా....."ఇంట్లో కూడా కొంత మందికి కరోనా రావడంతో వారి నుండి తాము చాల నేర్చుకున్నామని ఎలా ఉండాలో ఉండకూడకో కరోనా నేర్పించింది చెప్పుకొచ్చింది. 

 

మా ఇంట్లో పని చేసే వారికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిసి ఐదారు రోజులు షాక్‌లో ఉన్నాం.  ఇది ఎలా జరిగిందో మాకు అర్ధం కాలేదు.రాత్రి సమయంలో వేడి నీళ్లు కావాలి అంటే, వెంటనే చేతులకి గ్లౌజులు ధరించి తీసుకొని వస్తున్నాను. ముందు జాగ్రత్తలలో భాగంగా ఇలా చేస్తున్నాను అని జాన్వీ పేర్కొంది, అయితే ఆ కుటుంబాన్ని కరోనా భయం వీడటం లేదు" అని చెప్పుకొచ్చింది. 

 


కొద్ది రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండి వచ్చిన బోనీ కపూర్ ఫ్యామిలీని ఆ జ్ఞాపకాలు వెంటాడుతున్నాయట .వారి ఇంట్లో ప్రస్తుతం ముగ్గురు ఈ వైరస్‌ బారిన పడ్డారు. దీనిపై బోని కపూర్ ప్రతినిధి మాట్లాడుతూ.మంగళవారం బోని కపూర్‌ ఇంట్లో ఒకరు కరోనా సోకడంతో.. ఇంట్లోని అందరికీ టెస్ట్‌లు చేశారు. అందులో ఇద్దరికి పాజిటివ్‌ తేలగా, మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. బోని, జాన్వీ, ఖుషీలకు కూడా టెస్ట్‌ల్లో నెగిటివ్ వచ్చిందన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు క్వారంటైన్‌లో ఉన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బోని, జాన్వీ, ఖుషీలు కూడా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు.

 


 అయితే కరోనా సోకిన తన సిబ్బందికి కావాల్సిన ట్రీట్‌మెంట్ బోని కపూర్ చేయిస్తున్నారని పేర్కొన్నారు.కొవిడ్ అంటేనే వణుకువస్తోందని అన్నారు.ఐతే దీని ద్వారా తాము షూటింగ్ సమయాలలో కూడా ఎలా మసులు కోవలో తెలిసొచ్చింది అలాగే భౌతిక దూరం ఎంత అవసరమో అర్థం ఐనది అని కరోనా వచ్చిన భయపడకుండా అధైర్య పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా కోలుకుంటామో తెలిసిందని ఐతే రాకుండానే ముందు జాగ్రత్త చర్యలు అందరు పాటించాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: