బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.   సుశాంత్ సింగ్ ఉరేసుకొని చనిపోయాడనే వార్త యావత్ సినిలోకాన్ని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక సుశాంత్ మరణంపై సినీ ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  బాలీవుడ్ లో బంధు ప్రీతి ఎక్కువగా ఉందని.. సుశాంత్ మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నారని... ఇది ముమ్మాటికి మానసిక హత్యే అని పలువురు బాలీవుడ్ నటీ, నటులు అంటున్నారు.  పైకి కనిపించేంత బాలీవుడ్ లోపల లేదని.. బ్యాక్‌గ్రౌండ్ లేనివారిని ప్రోత్సహించరని ఎందరో హీరో హీరోయిన్లు ట్వీట్లు చేస్తున్నారు. 

IHG

తాజాగా  సుశాంత్‌ తన తల్లిని గుర్తు చేసుకుంటూ రాసిన ఓ లేఖ ఎందరినో కంటతడి పెట్టిస్తోంది. తల్లిని గుర్తు చేసుకుంటూ సుశాంత్‌ అందమైన కవితను రాశాడు. ‘నేను ఉన్నంత కాలం.. మీ జ్ఞాపకాలతోనే నేను సజీవంగా ఉన్నాను. ఓ నీడ వలే. కాలం ఎన్నటికి కదలదు. ఇది ఎంతో అందంగా ఉంది. ఇది ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది. అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు.

IHG

అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా’ అంటూ సుశాంత్ చివరిగా రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలే సుశాంత్ కన్నుమూసిన దుఖఃం నుంచి చాలా మంది కోలుకోలేదు.. ఈ లేఖ చూసి మరింత దుఖఃసాగరంలో మునిగిపోయారు. సుశాంత్‌ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. తన తల్లిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవాడు సుశాంత్. ఇదే కాక సుశాంత్‌ చివరి సోషల్‌ మీడియా మెసేజ్‌ కూడా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ రాశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: