సీమ అంటేనే అదోరకం ఘాటు. ఇక అక్కడ మిరపకాయ అంటే మరీ కారాలూ మిరియాలూ నూరేస్తుంది. ఇక ఆటంబాంబు లాంటి ఆడపిల్ల కూడా అయితే ఇక ఘాటుకే ఘాటు అని చెప్పాల్సిందే. ఇపుడు ఆ ఘాటూ, హాటూ అన్నీ మిక్సీ లో మిక్స్ చేసి చూసే కళ్ళకు,  నోటికీ  ఠారెత్తించేలా వస్తోంది అందాల రష్మిక.

IHG

రష్మిక ను అర్బన్ సెక్షన్ అమ్మాయిగా చూపించే సినిమాలు వచ్చాయి. ఆమె రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ  ఒక్కటి కూడా ఇప్పటిదాకా చేయలేదు. ఇపుడు అచ్చంగా ఆమెను మరీ మాస్ మసాలాగా చూపించే ప్రయత్నం జరుగుతోందిట. అది కూడా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ మూవీ పుష్పలో.

IHG

అసలే రష్మిక అందగత్తె. అలాంటి అమ్మడుని డీ గ్లామర్ రోల్ లో ప్రెజెంట్ చేయాలని సుకుమార్ గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సమంతను రంగస్థలం మూవీలో పల్లెటూరి పిల్లలా చూపించి మార్కులు కొట్టేసిన సుక్కూ ఈసారి రష్మిక మీద ప్రయోగాలు చేస్తున్నాడు.

IHG

మరి అందాల రష్మిక దీనికి రెడీ అంటోంది. ఆమె రాయలసీమ యాస మాట్లాడుతూ ఒక చందనపు స్మగ్లర్ కి జోడీ గా నటించబోతోంది. అంటే ఈ మూవీ అంతా మురికి బట్టలతో గల్లీల్లో తిరిగే పిల్లగా రష్మిక కనిపించబోతోందన్నమాట.

IHG

మరి రష్మిక దీన్ని ఒక చాలంజిగా తీసుకుందిట. ఈ సినిమా గ్యారంటీ హిట్ అని నమ్ముతున్న రష్మిక ఈ దెబ్బకు తనకు అవార్డులు రివార్డులు బోలేడు వస్తాయని కూడా ఆలోచిస్తోందిట. మరి రష్మిక చిత్తూరు యాసను కూడా నేర్చుకుంటోందిట. ఇంతలా పాత్రలో ఇన్వాల్వ్ అవుతున్న రష్మిక రేపటి రోజున వెండితెరను ఎలా తన నటనతో కుమ్మేస్తుందో చూడాల్సిందేగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: