హాస్య బ్రహ్మ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరి పేరే ఠక్కున గుర్తుకువస్తుంది. ఆయనే జంధ్యాల. ఆయన మాటల రచయితగా తెలుగు సినిమారంగ ప్రవేశం చేసి తరువాత దర్శకుడు అయ్యారు. దాదాపు నలభై  వరకూ సినిమాలు తీసిన జంధ్యాల అన్నీ కూడా హిట్లే కొట్టారు.

IHG

తెలుగు సినిమాకు అందమైన ఆరోగ్యమైన హాస్యాన్ని ఇచ్చారు. ఆయన సినిమాల్లో హాస్యం ఎపుడూ అపహాస్యం కాలేదు. మనిషి మెదడులో హాస్యం  గిలిగింతలు పెట్టాలి కానీ  తన్నుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలూ హాస్యం కాదని జంధ్యాల నమ్మేవారు. అందుకే ఆయన సినిమాలు ఈనాటికి కూడా కుటుంబం అంతా కలసి కూర్చుని చూసే సినిమాలు అయ్యాయి.

IHG

ఇక జంధ్యాల మొదటి సినిమా ముద్దమందారం. ఆ సినిమాతో  మొదలుపెట్టి తన చివరి సినిమా విచిత్రం వరకూ దాదాపుగా  అన్నీ ఆయన విశాఖ కేంద్రంగా చేసుకుని తీశారు. విశాఖ సాగర తీరాన్ని, ఇక్కడ అందాలను ఆయన ఎంతో చక్కగా చూపించారు. జంధ్యాల సినిమాలు చూస్తే చాలు, అందులో విశాఖ ఎదుగుదల ఎలా ఉంటుందో ప్రతీ దశా కూడా తెలుస్తుంది.

IHG

విశాఖకు సినిమా ఇండస్ట్రీ తరలిరావాలని ఆ తరువాత అంతా అన్నారు కానీ, మంద్రాస్ లో సినిమా పరిశ్రమ ఉన్నపుడే జంధ్యాల అక్కడకు వెళ్ళి సినిమాలు తీశారు. సహజసిధ్ధమైన విశాఖ, భీమిలీ అందాలను తన కెమెరా ద్వారా బంధించి సెల్యూలాయిడ్ మీద అంతే అందంగా ప్రెజెంట్ చేశారు.

IHG

విశాఖలో ఇపుడు నంబర్ వన్ గా ఉన్న ఎంవీపీ కాలనీ తొలినాళ్ళల్లో ఎలా ఉండేదో ఆయన ముద్దమందారం సినిమా చెబుతుంది. ఇక భీమిలీలోని డచ్చి వారి సమాధులు, అలాగే గాలిమేడలు వంటివి కూడా జంధ్యాల సినిమాల్లో కనిపిస్తాయి ఇపుడు గాలిమేడలు లేదు, ఎర్రమన్ను దిబ్బలు కూడ కరగిపోయాయి.

IHG

 మొత్తానికి చూస్తే జంధ్యాల విశాఖను ప్రేమిచేవారు. తన ప్రేయసిగా చెప్పుకున్నారు. ఆయన 2001లో జూన్ 19న 50 ఏళ్ల వయసులో ఈ లోకం నుంచి దూరం అయ్యారు. కానీ తరగని హాస్యంతో తెర మీద ఆయన ఎపుడూ మనతోననే ఉంటూ తెరస్మరణీమయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: