నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తాజా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాని బీ బీ 3 అని పిలుచుకుంటున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు బోయపాటి శ్రీను సింహా తీసి బాలకృష్ణ కి భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చాడు.

 

సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకొని బాలయ్యకి తిరుగు లేని క్రేజ్ ని తీసుకు వచ్చింది. సింహా తో ఫాం లోకి వచ్చిన బాలయ్య వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాంతో మరోసారి ‘లెజెండ్’ తో  బాలకృష్ణ కి భారీ హిట్ ని ఇచ్చాడు బోయపాటి. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే ఒక సెన్షేషన్ అయిపోయింది. 

 

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర అఘోర పాత్ర అని ప్రచారం సాగగా బోయపాటి ఆ పాత్ర విషయంలో క్లారిటి ఇచ్చారు. అంతేకాదు ఈ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు తాజా సమాచారం. త్వరలోనే ఆ రెండు గెటప్పులతో బాలయ్యకు మేకప్‌ టెస్ట్‌ లు చేసి అందులో ఒక గెటప్పుని ఫైనల్ చేస్తారట. ఇక ఈ సినిమాకు ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను అనుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్. రీసెంట్ గా బాలయ్య బర్త్ డే కి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారనుకున్న అభిమానులకి సగం సర్‌ప్రైజ్ మాత్రమే ఇచ్చారు బోయపాటి. టైటిల్ ఏంటో సస్పెన్స్ లో ఉంచారు.

 

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కొన్ని రోజులుగా తెర మీదకి కీర్తి సురేష్, అంజలి, కన్నడ హీరోయిన్ రచిత రాం అని..ఇలా చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. కాని బోయపాటి ఇంకా ఎవరీని ఫైనల్ చేయలేదని హీరోయిన్స్ ని త్వరలో ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించారు. ఆ న్యూస్ కూడా బాలయ్య బర్త్ డే రోజున వస్తుందనుకున్నారు. కాని ఈ విషయంలో కూడా సస్పెన్స్ వీడలేదు.

 

అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్య సరసన శ్రియా శరణ్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తారట. ఒకరు ఫస్టాఫ్ లో ఒకరు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా సెకండాఫ్ లో కనిపిస్తారని సమాచారం. ఇక "మోనార్క్" అన్న టైటిల్ వైరల్ అవుతున్నప్పటికి ఈ టైటిల్ అంటే ప్రేక్షకులు భయపడుతున్నారట. ఈ టైటిల్ తో హిట్ పడుతుందా సింహా, లెజెండ్ లాంటి టైటిల్ అయితే బావుంటుదన్న అభిప్రాయాలను వెల్లడిస్తున్నారట. మరి బోయపాటి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్ మాత్రం బాలయ్య స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: