సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన ఖ‌లేజా సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య 2010 అక్టోబ‌ర్ 7న రిలీజ్ అయ్యింది. అప్ప‌టికే మ‌హేష్ బాబు న‌టించిన అతిథి సినిమా 2007లో వ‌చ్చింది. ఈ సినిమా వ‌చ్చి మూడేళ్లు దాట‌డంతో మ‌హేష్ సినిమా కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా... క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూశారు. అప్ప‌టికే త్రివిక్ర‌మ్ - మ‌హేష్ సినిమాలో వ‌చ్చిన అత‌డు సినిమా సైతం వెండితెర‌పై ఓ మోస్త‌రుగా ఆడినా బుల్లితెర‌ను మాత్రం ప‌దే ప‌దే షేక్ చేసింది. ఇక ఖ‌లేజా సినిమాలో అనుష్క హీరోయిన్ కావ‌డంతో పాటు మాట‌ల మాంత్రికుడు మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర్చిన బాణీలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద క్యూలో ఉండి మ‌రీ టిక్కెట్లు తీసుకుని సినిమాలు చేశారు. అయితే అత్య‌ధ్భుత‌మైన స‌బ్జెక్ట్‌ను ఎంచుకున్న త్రివిక్ర‌మ్ దానిని తెర‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ఎక్క‌డో త‌డ‌బ‌డ్డాడు. సినిమా క‌థ‌, డెప్త్ సామాన్యుడికి అర్థం కాలేదు. అయితే మ‌హేష్‌ను సినిమాలో ప్ర‌జెంట్ చేసిన విధానం, కామెడీ, ఫ‌స్టాఫ్ పంచ్‌లు, పాట‌లు, డ్యాన్సులు, భారీ బ‌డ్జెట్ ఇవ‌న్నీ హైలెట్ అయ్యాయి. కీల‌క‌మైన సెకండాఫ్‌లో క‌థాంశం చాలా మంచిదే ఉన్నా ఎగ్జిగ్యూష‌న్ తేడా కొట్ట‌డంతో చాలా మందికి అర్థం కాలేదు. మ‌హేష్ సినిమా కోసం మూడేళ్లుగా వెయిట్ చేసిన అభిమానులు ఏదో మాస్ క‌థ‌తో లేదా ఫ్యామిలీ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాడ‌ని ఊహించుకున్నారు.

 

అయితే అందుకు భిన్నంగా క‌థ‌, క‌థ‌నాలు ఉండ‌డంతో ఈ సినిమా ఆ భారీ అంచ‌నాల నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌లేదు. అయితే త‌ర్వాత బుల్లితెర‌పై ఈ సినిమా వేసిన‌ప్పుడు మాత్రం చాలా సార్లు టీఆర్పీ రేటింగులు బ‌ద్ద‌ల‌య్యాయి. మ‌హేష్ - అనుష్క జోడీ, మ‌ణిశ‌ర్మ సంగీతం, పాట‌లు, డ్యాన్సులు ప్రేక్ష‌కులు మ‌దిలో ఎప్ప‌ట‌కీ చెర‌గ‌ని ముద్ర వేశాయి. ఇక ఆ సినిమా క‌థ‌, క‌థ‌నాలు కూడా అతడు సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌క పోయినా త‌ర్వాత బాగా న‌చ్చ‌డంతో వెండితెర‌పై స‌క్సెస్ కాని ఖ‌లేజా బుల్లితెర‌పై ఎప్పుడూ స‌క్సెస్ అవుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: