ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో పైకి చెప్పకపోయినా చాలమంది కొరటాల శివ పరిస్థితి పై సానుభూతి చేపెడుతున్నారు అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. మూడు నెలల తర్వాత షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో చాలా సినిమాలు షూటింగ్ లకు రెడీ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి కొరటాల ‘ఆచార్య’  షూటింగ్ ను  వచ్చేనెలలో ప్రారంభించాలని కొరటాల భావించాడు.


కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ వద్దంటూ చిరంజీవి ఒక అభిప్రాయానికి రావడంతో ఆ అభిప్రాయాన్ని ఈమధ్య చరణ్ కొరటాల ను తన వద్దకు పిలిపించుకుని చెప్పినట్లు టాక్. దీనితో ‘ఆచార్య’ షూటింగ్ కు  అన్ని సిద్ధం చేసుకుంటున్న కొరటాల మైండ్ బ్లాంక్ అయినట్లు సమా చారం. వాస్తవానికి ‘భరత్ అనే నేను’ విడుదల తరువార్త అనేక ఆఫర్లు కొరటాలకు వచ్చినా చిరంజీవితో సినిమాకు కమిట్ అవ్వడంతో కొరటాల మరో సినిమాను చేయలేకపోయాడు.


‘సైరా’ నరసింహారెడ్డి చిత్రం కారణంగా ‘ఆచార్య’ చాల ఆలస్యం అయింది. ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది అనుకుంటున్న సమయంలో కరోనా దాడి మొదలు కావడంతో కొరటాల అసలు నీరు కారిపోయాయి. షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో వేగంగా ‘ఆచార్య’ షూటింగ్ ను పూర్తి చేసి మరోకొత్తమూవీ ప్రాజెక్ట్ ను వచ్చేఏడాది మొదలుపెట్టాలని కొరటాల భావించాడు.  


అయితే  ఇప్పట్లో ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ కు వచ్చే ఉద్దేశ్యం చిరంజీవి లేనట్లుగా వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అందరి ఆరోగ్య దృష్ట్యా కొంతకాలం వరకు షూటింగ్ ను ఆపాలంటూ కొరటాలకు చిరంజీవి తరుఫున చరణ్ సూచించినట్లు తెలుస్తోంది. దీనితో చిరంజీవి మాటకు ఎదురు చెప్పలేక ‘ఆచార్య’ మూవీ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక కొరటాల  చిరు చరణ్ లపై కొరటాల అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇప్పుడున్న పరిస్థితులలో ‘ఆచార్య’ వచ్చే ఏడాది వరకు పూర్తి అయ్యే పరిస్థితులు లేకపోవడంతో కొరటాల చిరంజీవిని నమ్ముకుని రెండుఏళ్ళ విలువైన కాలాన్ని పోగొట్టుకోవడమే కాకుండా సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకునే కొరటాల ‘ఆచార్య’ ఆలస్యంతో 20 కోట్లు పోగొట్టుకున్నాడు అంటూ ఇండస్ట్రీలోని కొందరు కొరటాల పై సానుభూతి చూపిస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: